Iravaina neeraaga keduraidiraa | nee

ఇరవైన నీరాక కెదురైతిరా । నీ
Language

(॥పల్లవి॥)
ఇరవైన నీరాక కెదురైతిరా । నీ-
పరిణాములే చూడఁ బాలాయరా

(॥ఇర॥)
నిద్దురకన్నుల రాఁగా నీ మొగముచూచి నేను
అద్దిరా జాగరమంటా నలిగితిరా
చద్దివిడెము పుక్కిట సవరించుకొని రాఁగా
వద్దిక మాఁటాడవంటా నుస్సురంటిరా

(॥ఇర॥)
సారెకు నిట్టూరుపుతో సదమదమై యుండఁగ
నీరువంకతుంగవంటా నిలిచితిరా
మేరతో వానలెల్లా మేన వాసించుకరాఁగా
తేఁరె బనులెల్లానంటాఁ దిరిగితిరా

(॥ఇర॥)
కాంతుల నీ మోము చంద్రకళలుదేరఁగఁ జూచి
వింతలెల్లాఁ గంటినంటా వెరగైతిరా
యింతలో శ్రీవేంకటేశ యిట నన్నుఁ గూడఁగాను
వంతమెల్లాఁ జెల్లెనంటాఁ బైకొంటిరా

(||pallavi||)
iravaina nīrāga kĕduraidirā | nī-
pariṇāmule sūḍam̐ bālāyarā

(||ira||)
nidduragannula rām̐gā nī mŏgamusūsi nenu
addirā jāgaramaṁṭā naligidirā
saddiviḍĕmu pukkiḍa savariṁchugŏni rām̐gā
vaddiga mām̐ṭāḍavaṁṭā nussuraṁṭirā

(||ira||)
sārĕgu niṭṭūrubudo sadamadamai yuṁḍam̐ga
nīruvaṁkaduṁgavaṁṭā nilisidirā
merado vānalĕllā mena vāsiṁchugarām̐gā
tem̐rĕ banulĕllānaṁṭām̐ dirigidirā

(||ira||)
kāṁtula nī momu saṁdragaḽaluderam̐gam̐ jūsi
viṁtalĕllām̐ gaṁṭinaṁṭā vĕragaidirā
yiṁtalo śhrīveṁkaḍeśha yiḍa nannum̐ gūḍam̐gānu
vaṁtamĕllām̐ jĕllĕnaṁṭām̐ baigŏṁṭirā