Iravai mannimchavayya imti guna midivo

ఇరవై మన్నించవయ్య ఇంతి గుణ మిదివో
Language

(॥పల్లవి॥)
ఇరవై మన్నించవయ్య ఇంతి గుణ మిదివో
తరుణివారము గాన తగుఁల జెప్పితిమి

(॥॥)
కొమ్మ నీతో పొందుచేసి కొరి పిన్నానాఁడాడే
బొమ్మలఁ దేనియ్యదు నీ పొందు దగిలీనంటా
ఇమ్ముల సవతి పోరు కిసుమంత కోప దీకె
యెమ్మె కెవ్వతెఁ దెచ్చినా నెట్టవునో పనులు

(॥॥)
నీవూఁ దాను గూచుండఁగా నిలువుటద్దములోన
సోవగాఁ బతిరూపులు చూడనోపరు
తావులఁ దననీడకు తా నలిగీని చెలి
ఆవలి ఇంతిఁ దెచ్చితే నప్పు డేమేమౌనో

(॥॥)
తనరూపు వ్రాసి వేరేతరుణి యయ్యీనంటా
యెనలేని తనసంది నిడుకొనెను
ఘనుఁడు శ్రీ వేంకటేశ కైకొంటివి ఇంతిని
ననుపు చెల్లులపొందు నవ్వుఁబాటు సుమ్మీ

(||pallavi||)
iravai manniṁchavayya iṁti guṇa midivo
taruṇivāramu gāna tagum̐la jĕppidimi

(||||)
kŏmma nīdo pŏṁdusesi kŏri pinnānām̐ḍāḍe
bŏmmalam̐ deniyyadu nī pŏṁdu dagilīnaṁṭā
immula savadi poru kisumaṁta koba dīgĕ
yĕmmĕ kĕvvadĕm̐ dĕchchinā nĕṭṭavuno panulu

(||||)
nīvūm̐ dānu gūsuṁḍam̐gā niluvuḍaddamulona
sovagām̐ badirūbulu sūḍanobaru
tāvulam̐ dananīḍagu tā naligīni sĕli
āvali iṁtim̐ dĕchchide nappu ḍememauno

(||||)
tanarūbu vrāsi veredaruṇi yayyīnaṁṭā
yĕnaleni tanasaṁdi niḍugŏnĕnu
ghanum̐ḍu śhrī veṁkaḍeśha kaigŏṁṭivi iṁtini
nanubu sĕllulabŏṁdu navvum̐bāḍu summī