ఇరవాయ వలపులు యిద్దరికీ నీడనే
(॥పల్లవి॥)
ఇరవాయ వలపులు యిద్దరికీ నీడనే
సరవితో నేలితివి చనవిమ్మీ యిపుడు
(॥॥)
వొడి వట్టుకొంటి వాకె వోపనంటాఁ బెనఁగీని
వొడఁ బరచేవు చన్నులొరసుకొంటా
బడలి వున్నది యాకె బ్రమలఁ బెట్టక యిఁక
తొడపై నిడుకోరాదా తొడిఁబడును
(॥॥)
చేయి వట్టుకొంటి వాపె చేరి యానలు వెట్టీని
నాయము వెట్టేవు మోవి నవ్వు కొంటాను
యీయకొని వున్న దాకె యేఁపులఁ బెట్టక యిఁక
పోయరాదా తలఁబాలు పొద్దులు గడపక
(॥॥)
కొప్పువట్టుకొంటి వాకె గుచ్చి కాఁగిలించుకొనీ
చొప్పులంటించేవు రతిఁ జొక్కించుకొంటా
ఇప్పుడే శ్రీవేంకటేశ యెలయించకిఁక నాకె
దప్పిదేరిచితి వాకెదండ నుండరాదా
(||pallavi||)
iravāya valabulu yiddarigī nīḍane
saravido nelidivi sanavimmī yibuḍu
(||||)
vŏḍi vaṭṭugŏṁṭi vāgĕ vobanaṁṭām̐ bĕnam̐gīni
vŏḍam̐ barasevu sannulŏrasugŏṁṭā
baḍali vunnadi yāgĕ bramalam̐ bĕṭṭaga yim̐ka
tŏḍabai niḍugorādā tŏḍim̐baḍunu
(||||)
seyi vaṭṭugŏṁṭi vābĕ seri yānalu vĕṭṭīni
nāyamu vĕṭṭevu movi navvu kŏṁṭānu
yīyagŏni vunna dāgĕ yem̐pulam̐ bĕṭṭaga yim̐ka
poyarādā talam̐bālu pŏddulu gaḍabaga
(||||)
kŏppuvaṭṭugŏṁṭi vāgĕ guchchi kām̐giliṁchugŏnī
sŏppulaṁṭiṁchevu radim̐ jŏkkiṁchugŏṁṭā
ippuḍe śhrīveṁkaḍeśha yĕlayiṁchagim̐ka nāgĕ
dappiderisidi vāgĕdaṁḍa nuṁḍarādā