Iravaaya numdavayya yemi seppevu

ఇరవాయ నుండవయ్య యేమి చెప్పేవు
Language

(॥పల్లవి॥)
ఇరవాయ నుండవయ్య యేమి చెప్పేవు
సరుసఁ గూచున్నదెల్ల చనవే కాదా

(॥ఇర॥)
తగులు తెలిసితిమి తరుణికి నీకును
మొగము చూచుటెల్లా మోహమే కాదా
యెగసక్కేలకు నీవు యేమిటికి దాఁచేవు
నగినదెల్లా మీమీ నంటులే కానా

(॥ఇర॥)
కాయకపు మీగుట్టు కానవచ్చె నాకిట్టే
ఆయములంటినవెల్లా నాసలే కావా
చాయల మమ్మింత యేల సారె నొడఁబరచేవు
పాయక మాటలాడేది పైకొనుటే కాదా

(॥ఇర॥)
యెరవులు లేక మీరిద్దరొక్క పచ్చడము
పొరిఁ గప్పుకొనుటే పొందులు గావా
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టే
సరసములాడుటలే చవులుగావా

(||pallavi||)
iravāya nuṁḍavayya yemi sĕppevu
sarusam̐ gūsunnadĕlla sanave kādā

(||ira||)
tagulu tĕlisidimi taruṇigi nīgunu
mŏgamu sūsuḍĕllā mohame kādā
yĕgasakkelagu nīvu yemiḍigi dām̐sevu
naginadĕllā mīmī naṁṭule kānā

(||ira||)
kāyagabu mīguṭṭu kānavachchĕ nāgiṭṭe
āyamulaṁṭinavĕllā nāsale kāvā
sāyala mammiṁta yela sārĕ nŏḍam̐barasevu
pāyaga māḍalāḍedi paigŏnuḍe kādā

(||ira||)
yĕravulu lega mīriddarŏkka pachchaḍamu
pŏrim̐ gappugŏnuḍe pŏṁdulu gāvā
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭe
sarasamulāḍuḍale savulugāvā