Iravaaya nayyaa meeyiddari vedugalunu

ఇరవాయ నయ్యా మీయిద్దరి వేడుకలును
Language

(॥పల్లవి॥)
ఇరవాయ నయ్యా మీయిద్దరి వేడుకలును
సరసములాడెఁగా సారె నీతో నాపె

(॥॥)
తూఁగుమంచ మెక్కించుక తొడమీఁదఁ దొడ వేసి
మాఁగినమోఁవి యిచ్చెఁగా మగువ నీకు
వేఁగైన చన్నులు నీవీఁపుమీద వేసుకొని
కాగిలించుకొనెఁగా కలికి నిన్ను

(॥॥)
మలగుపై నొరగించి మంతనములాడుకొంటా
కలకల నవ్వెఁగా కాంత నీతోను
చెలరేఁగి చెక్కులు నీచెక్కులతోఁ బెనగొన
వలపులు రేఁచెగా వనిత నీకు

(॥॥)
పచ్చడముపైఁ గప్పి పలుకులఁ జొక్కించి
యిచ్చకానఁ గూడెఁగా ఇంతి నీతోను
ముచ్చట శ్రీవేంకటేశ ముందు నన్నుఁ గూడితివి
లచ్చనలు నించెఁగా లలన నీపైని

(||pallavi||)
iravāya nayyā mīyiddari veḍugalunu
sarasamulāḍĕm̐gā sārĕ nīdo nābĕ

(||||)
tūm̐gumaṁcha mĕkkiṁchuga tŏḍamīm̐dam̐ dŏḍa vesi
mām̐ginamom̐vi yichchĕm̐gā maguva nīgu
vem̐gaina sannulu nīvīm̐pumīda vesugŏni
kāgiliṁchugŏnĕm̐gā kaligi ninnu

(||||)
malagubai nŏragiṁchi maṁtanamulāḍugŏṁṭā
kalagala navvĕm̐gā kāṁta nīdonu
sĕlarem̐gi sĕkkulu nīsĕkkuladom̐ bĕnagŏna
valabulu rem̐sĕgā vanida nīgu

(||||)
pachchaḍamubaim̐ gappi palugulam̐ jŏkkiṁchi
yichchagānam̐ gūḍĕm̐gā iṁti nīdonu
muchchaḍa śhrīveṁkaḍeśha muṁdu nannum̐ gūḍidivi
lachchanalu niṁchĕm̐gā lalana nībaini