Ippudunu neevu naagu ichchagamu sesevu

ఇప్పుడును నీవు నాకు ఇచ్చకము సేసేవు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడును నీవు నాకు ఇచ్చకము సేసేవు
అప్పుడైతే నింతేసి అనువుకు వత్తువా

(॥ఇప్పు॥)
చలముసాదించేవేళ సరసునితోడను
పలికినపలుకెల్ల పంతములౌను
యెలమి నీలాగెరింగి ఇందుకే వూరకుండితి
మలసి నీవంతలోనే మంచివాఁడవైతివి

(॥ఇప్పు॥)
గోరబుసేసేటివేళ గోర గీరి యేపాటి
సరసములాడినాను సాదింపులౌను
ధరలో నీజాడెరిఁగి తలవంచుక వుండితి
మరిగి నీవంతలోనే మంచివాఁడవైతివి

(॥ఇప్పు॥)
సిగ్గులు పరచేవేళ శ్రీవేంకటేశ్వర నీ
దగ్గరఁ గూచుండినాను తమకమౌను
వొగ్గి నీగుణ మెరిఁగి వోటుకై నిన్నుఁ గూడితి
మగ్గపు రతులవేళ మంచివాఁడ వైతివి

(||pallavi||)
ippuḍunu nīvu nāgu ichchagamu sesevu
appuḍaide niṁtesi anuvugu vattuvā

(||ippu||)
salamusādiṁcheveḽa sarasunidoḍanu
paliginabalugĕlla paṁtamulaunu
yĕlami nīlāgĕriṁgi iṁduge vūraguṁḍidi
malasi nīvaṁtalone maṁchivām̐ḍavaidivi

(||ippu||)
gorabuseseḍiveḽa gora gīri yebāḍi
sarasamulāḍinānu sādiṁpulaunu
dharalo nījāḍĕrim̐gi talavaṁchuga vuṁḍidi
marigi nīvaṁtalone maṁchivām̐ḍavaidivi

(||ippu||)
siggulu paraseveḽa śhrīveṁkaḍeśhvara nī
daggaram̐ gūsuṁḍinānu tamagamaunu
vŏggi nīguṇa mĕrim̐gi voḍugai ninnum̐ gūḍidi
maggabu radulaveḽa maṁchivām̐ḍa vaidivi