Ippudugaaga neebaga timka nennade

ఇప్పుడుగాక నీపగ టిఁక నెన్నడే
Language

(॥పల్లవి॥)
ఇప్పుడుగాక నీపగ టిఁక నెన్నడే
చెప్పరాదు నీసేఁతలు చెల్లెఁగా నేఁడు

(॥ఇప్పు॥)
వంతులకుఁ బెనఁగేవు వాసులకు జునిఁగేవు
యెంతలేదు నీయెమ్మె లేమిచెప్పేదే
పంతములు మెఱసేవు పైకొని జఱసేవు
కాంతుఁ డిచ్చినచనవు గద్దుగా నీకు

(॥ఇప్పు॥)
చెక్కు చేత మోపేవు సిగ్గు లెల్ల నాఁపేవు
అక్కజపుదొరవు నీ వౌదువే మేలు
కక్కసించి సొలసేవు కాఁకల మలసేవు
నిక్కి జవ్వనమదము నిండెఁగా నీకు

(॥ఇప్పు॥)
సన్నలనే మొక్కేవు సారెఁ గాలుదొక్కేవు
పన్నిననీవుదు టిఁకఁ బట్టఁగరాదే
యెన్నఁగ శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
నన్నుఁ గూడె వేడుకలు ననిచెఁగా నీకు

(||pallavi||)
ippuḍugāga nībaga ṭim̐ka nĕnnaḍe
sĕpparādu nīsem̐talu sĕllĕm̐gā nem̐ḍu

(||ippu||)
vaṁtulagum̐ bĕnam̐gevu vāsulagu junim̐gevu
yĕṁtaledu nīyĕmmĕ lemisĕppede
paṁtamulu mĕṟasevu paigŏni jaṟasevu
kāṁtum̐ ḍichchinasanavu gaddugā nīgu

(||ippu||)
sĕkku seda mobevu siggu lĕlla nām̐pevu
akkajabudŏravu nī vauduve melu
kakkasiṁchi sŏlasevu kām̐kala malasevu
nikki javvanamadamu niṁḍĕm̐gā nīgu

(||ippu||)
sannalane mŏkkevu sārĕm̐ gāludŏkkevu
panninanīvudu ṭim̐kam̐ baṭṭam̐garāde
yĕnnam̐ga śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
nannum̐ gūḍĕ veḍugalu nanisĕm̐gā nīgu