Ippudugaa maagella negasittamaaya nemdu

ఇప్పుడుగా మాకెల్ల నేకచిత్తమాయ నేఁడు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడుగా మాకెల్ల నేకచిత్తమాయ నేఁడు
తప్పులెల్ల వొప్పులాయఁ దరవాతి పనులు

(॥ఇప్పు॥)
మంతనాన నేమంటివో మనసునఁ బెట్టుకొని
చింతతోనుండె నిందాఁకాఁ జెక్కుచేతితో
అంతలో నీవు విచ్చేసి ఆకెఁ గాఁగిలించుకోఁగా
సంతసానఁబొందెఁ జెలి చక్కనాయఁ బనులు

(॥ఇప్పు॥)
నిన్నటిరేతిరిలోనే నీవేమి సేసితివో
పన్నిన ముసుఁగుతోడఁ బవళించెను
మన్నించి నీ వింతలోనే మగువను వేడుకోఁగా
యెన్నికలు సరివచ్చి యీడేరెఁ బనులు

(॥ఇప్పు॥)
యెరపరికపుఁ జూపులెట్లాఁ జూచితో కాని
అరమరపున నుస్సురంటా నుండెను
యిరవుగ శ్రీవేంకటేశ యింతలోఁ గూడితి-
వరుదంది చెలి మెచ్చెననువాయఁ బనులు

(||pallavi||)
ippuḍugā māgĕlla negasittamāya nem̐ḍu
tappulĕlla vŏppulāyam̐ daravādi panulu

(||ippu||)
maṁtanāna nemaṁṭivo manasunam̐ bĕṭṭugŏni
siṁtadonuṁḍĕ niṁdām̐kām̐ jĕkkusedido
aṁtalo nīvu vichchesi āgĕm̐ gām̐giliṁchugom̐gā
saṁtasānam̐bŏṁdĕm̐ jĕli sakkanāyam̐ banulu

(||ippu||)
ninnaḍiredirilone nīvemi sesidivo
pannina musum̐gudoḍam̐ bavaḽiṁchĕnu
manniṁchi nī viṁtalone maguvanu veḍugom̐gā
yĕnnigalu sarivachchi yīḍerĕm̐ banulu

(||ippu||)
yĕrabarigabum̐ jūbulĕṭlām̐ jūsido kāni
aramarabuna nussuraṁṭā nuṁḍĕnu
yiravuga śhrīveṁkaḍeśha yiṁtalom̐ gūḍidi-
varudaṁdi sĕli mĕchchĕnanuvāyam̐ banulu