ఇప్పుడు విచ్చేసితివి యింటికాడకు
(॥పల్లవి॥)
ఇప్పుడు విచ్చేసితివి యింటికాడకు
కుప్పలుగా వలపులు కురిసితిమయ్యా
(॥॥)
నెలఁతల నెదురంపి నీకెదురులు చూచి
పెలుచన నిన్నునిట్టే పేరఁ బిలిచి
పలు సగినాలు చూచి పలుకులాలకించి
చెలరేఁగి-జాగరాలు సేసితిమయ్యా
(॥॥)
పాటలు నీపైఁ బాడి పక్కన నీవేళ గాచి
కూటువ మనోరథాలు గోరి కోరి
గాటమున మొక్కుకొంటా కానికె చేతఁ బూనుక
నీటున నిందాఁకాను నిలుచుంటిమయ్యా
(॥॥)
నీరూపు దలపోసి నిద్దుర కలలు గని
నేరుపుతో నీవురాగా నిన్నుఁ జేరి
యీరీతి శ్రీవేంకటేశ యింతలో నిన్నుఁ గూడితి
మేరతో నిట్టే నిన్ను మెచ్చితిమయ్యా
(||pallavi||)
ippuḍu vichchesidivi yiṁṭigāḍagu
kuppalugā valabulu kurisidimayyā
(||||)
nĕlam̐tala nĕduraṁpi nīgĕdurulu sūsi
pĕlusana ninnuniṭṭe peram̐ bilisi
palu saginālu sūsi palugulālagiṁchi
sĕlarem̐gi-jāgarālu sesidimayyā
(||||)
pāḍalu nībaim̐ bāḍi pakkana nīveḽa gāsi
kūḍuva manorathālu gori kori
gāḍamuna mŏkkugŏṁṭā kānigĕ sedam̐ būnuga
nīḍuna niṁdām̐kānu nilusuṁṭimayyā
(||||)
nīrūbu dalabosi niddura kalalu gani
nerubudo nīvurāgā ninnum̐ jeri
yīrīdi śhrīveṁkaḍeśha yiṁtalo ninnum̐ gūḍidi
merado niṭṭe ninnu mĕchchidimayyā