ఇప్పుడు విచ్చేసితి వేమందు నే నిఁక
(॥పల్లవి॥)
ఇప్పుడు విచ్చేసితి వేమందు నే నిఁక
కప్పిన మొగమోటముగలదాన నేను
(॥ఇప్పు॥)
యెదురుచూచితి నీకు నెప్పుడు వత్తువోయంటా
నిదుర గంటికి రాక నిన్ననెల్లాను
వెదకి తెమ్మంటి నిన్ను వెలదుఁలనెల్లాఁ బంపి
వుదుటున నెవ్వతింట నుందువోయంటాను
(॥ఇప్పు॥)
పేరుకొని పిలిచితి పెద్దవాస నను నిన్ను
కూరిమితో నిట్టె పలుకుదువంటాను
వారివీరి నడిగితి వలసినచోట్లను
ఆరగించి పవ్వళించే యట్టినీ ఇక్కువలు
(॥ఇప్పు॥)
దేవరకే మొక్కుకొంటి దిక్కులకుఁ జేయెత్తి
కావించి నిన్నుఁ గన్నులఁగన్నదాఁకాను
శ్రీ వేంకటేశ నన్ను జిగిఁ గూడితివి నేఁడు
తావులనే నెలకొంటి దక్కుదువంటాను
(||pallavi||)
ippuḍu vichchesidi vemaṁdu ne nim̐ka
kappina mŏgamoḍamugaladāna nenu
(||ippu||)
yĕdurusūsidi nīgu nĕppuḍu vattuvoyaṁṭā
nidura gaṁṭigi rāga ninnanĕllānu
vĕdagi tĕmmaṁṭi ninnu vĕladum̐lanĕllām̐ baṁpi
vuduḍuna nĕvvadiṁṭa nuṁduvoyaṁṭānu
(||ippu||)
perugŏni pilisidi pĕddavāsa nanu ninnu
kūrimido niṭṭĕ paluguduvaṁṭānu
vārivīri naḍigidi valasinasoṭlanu
āragiṁchi pavvaḽiṁche yaṭṭinī ikkuvalu
(||ippu||)
devarage mŏkkugŏṁṭi dikkulagum̐ jeyĕtti
kāviṁchi ninnum̐ gannulam̐gannadām̐kānu
śhrī veṁkaḍeśha nannu jigim̐ gūḍidivi nem̐ḍu
tāvulane nĕlagŏṁṭi dakkuduvaṁṭānu