Ippudu vegiramele imti neegu

ఇప్పుడు వేగిరమేలే ఇంతి నీకు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడు వేగిరమేలే ఇంతి నీకు
తప్పులెల్లా మాని పతి తానే వలచును

(॥ఇప్పు॥)
నెయ్యము గలుగుచోట నెరుసు లేమిగల్లాను
కయ్యము లడువనేల కాంతలకు
వొయ్యనే ఆరమణుని కూడిగాలు సేయఁగాను
కొయ్యతనాలెల్లా మాని కూరిములు సేసును

(॥ఇప్పు॥)
చేతికి లోనైనయెడ సిలుగు లేమి పుట్టినా
కాతరించి దూరనేల కాంతలకు
ఆతుమైనయాతని నన్నిటాఁ బొదుగఁగాను
యేతులకుఁదాఁ దానే యిరవై నిలుచును

(॥ఇప్పు॥)
చనవు గలిగినందు సారెఁ బరాకై నాను
కనలి తిట్టఁగనేల కాంతలకు
యెనసి శ్రీవేంకటేశు నిచ్చలో నిట్టెవుండఁగ
మనసున బత్తిగల్లి మన్నించు నిచటా

(||pallavi||)
ippuḍu vegiramele iṁti nīgu
tappulĕllā māni padi tāne valasunu

(||ippu||)
nĕyyamu galugusoḍa nĕrusu lemigallānu
kayyamu laḍuvanela kāṁtalagu
vŏyyane āramaṇuni kūḍigālu seyam̐gānu
kŏyyadanālĕllā māni kūrimulu sesunu

(||ippu||)
sedigi lonainayĕḍa silugu lemi puṭṭinā
kādariṁchi dūranela kāṁtalagu
ādumainayādani nanniḍām̐ bŏdugam̐gānu
yedulagum̐dām̐ dāne yiravai nilusunu

(||ippu||)
sanavu galiginaṁdu sārĕm̐ barāgai nānu
kanali tiṭṭam̐ganela kāṁtalagu
yĕnasi śhrīveṁkaḍeśhu nichchalo niṭṭĕvuṁḍam̐ga
manasuna battigalli manniṁchu nisaḍā