Ippudu segonevaamda vimdaamkaa nemdumti vani

ఇప్పుడు చేకొనేవాఁడ విందాఁకా నెందుంటి వని
Language

(॥పల్లవి॥)
ఇప్పుడు చేకొనేవాఁడ విందాఁకా నెందుంటి వని
చిప్పిలు నా కోపము చెలరేఁగీఁ గాక

(॥ఇప్పు॥)
యిల నీ వేమి సేసినా నియ్యకొనక నీతో నేఁ
నలిగితిఁగా నిన్ను నన నో రేది
బలిమి నీ వప్పటిని పైకొని మన్నించఁగాను
నిలువరాక కన్నుల నీరు గారీఁ గాక

(॥ఇప్పు॥)
యిచ్చగించి యుండిక నే నివ్వలిమోమై యిల్లు
చొచ్చితి నింకా నీమోము చూడఁ జోటేది
గచ్చుల నీ వప్పటిని కాఁగిలించుకొనఁగాను
చెచ్చెర నానిట్టూర్పులు చిమ్మిరేఁగీఁ గాక

(॥ఇప్పు॥)
గారవానఁ దొలుతనే కందువలఁ గొసరక
వూరకుండి యిఁక నిన్ను నొద్దన నేది
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కారుకమ్మి నివ్వెరఁగు కడు నిండీఁ గాక

(||pallavi||)
ippuḍu segŏnevām̐ḍa viṁdām̐kā nĕṁduṁṭi vani
sippilu nā kobamu sĕlarem̐gīm̐ gāga

(||ippu||)
yila nī vemi sesinā niyyagŏnaga nīdo nem̐
naligidim̐gā ninnu nana no redi
balimi nī vappaḍini paigŏni manniṁcham̐gānu
niluvarāga kannula nīru gārīm̐ gāga

(||ippu||)
yichchagiṁchi yuṁḍiga ne nivvalimomai yillu
sŏchchidi niṁkā nīmomu sūḍam̐ joḍedi
gachchula nī vappaḍini kām̐giliṁchugŏnam̐gānu
sĕchchĕra nāniṭṭūrbulu simmirem̐gīm̐ gāga

(||ippu||)
gāravānam̐ dŏludane kaṁduvalam̐ gŏsaraga
vūraguṁḍi yim̐ka ninnu nŏddana nedi
yīrīdi śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
kārugammi nivvĕram̐gu kaḍu niṁḍīm̐ gāga