ఇప్పుడు నీవు వచ్చితి విది చూచి నా కదివో
(॥పల్లవి॥)
ఇప్పుడు నీవు వచ్చితి విది చూచి నా కదివో
చొప్పుగా రెండు భావాలు చూపి చెప్పరాదు
(॥ఇప్పు॥)
తక్కక యెడసి నిన్నుఁ దలఁచఁగాఁ దలఁచఁగా
యెక్కడచూచినా నీవై యిదే తోఁచేవు
వెక్కసపునీసుద్దులే వేమారు వినఁగాను
మక్కువ వీసులకు నీమాటలే వుండీని
(॥ఇప్పు॥)
వరుసతో నీరూపు వ్రాయఁగా వ్రాయఁగాను
అరుదై చేతికిఁ జిక్కినట్టె తోఁచీని
సరవి నీగుణములు సతులతో నాడుకోఁగా
తొరలీ నీపేరే నాతుదనాలికెకును
(॥ఇప్పు॥)
కందువ నీకుగానే కలఁగనఁగా గనఁగా
అంది కాఁగిటఁగూడినయట్టె తోఁచీని
విందుగా నన్నిపుడె శ్రీవేంకటేశ కూడితివి
చందముగా నాకన్నిటా సతమై యేలితివి
(||pallavi||)
ippuḍu nīvu vachchidi vidi sūsi nā kadivo
sŏppugā rĕṁḍu bhāvālu sūbi sĕpparādu
(||ippu||)
takkaga yĕḍasi ninnum̐ dalam̐sam̐gām̐ dalam̐sam̐gā
yĕkkaḍasūsinā nīvai yide tom̐sevu
vĕkkasabunīsuddule vemāru vinam̐gānu
makkuva vīsulagu nīmāḍale vuṁḍīni
(||ippu||)
varusado nīrūbu vrāyam̐gā vrāyam̐gānu
arudai sedigim̐ jikkinaṭṭĕ tom̐sīni
saravi nīguṇamulu sadulado nāḍugom̐gā
tŏralī nībere nādudanāligĕgunu
(||ippu||)
kaṁduva nīgugāne kalam̐ganam̐gā ganam̐gā
aṁdi kām̐giḍam̐gūḍinayaṭṭĕ tom̐sīni
viṁdugā nannibuḍĕ śhrīveṁkaḍeśha kūḍidivi
saṁdamugā nāganniḍā sadamai yelidivi