ఇప్పుడు నీవు రాఁగాను ఇంత సంతోసించెఁ గాని
(॥పల్లవి॥)
ఇప్పుడు నీవు రాఁగాను ఇంత సంతోసించెఁ గాని
వుప్పతిల్లుఁ గోరికల నువ్విళ్ళూరుచుండును
(॥ఇప్పు॥)
మగువతోఁ జెప్పెంపినమాటలు
తగుల నీవు సేసిన తమ్మివాటులు
సాగిసి జూజాలాడిన చోటులు
నిగిడి తలఁచుకొని నీకెదురు చూచును
(॥ఇప్పు॥)
చుట్టమవై నీ వంపిన సొమ్ములు
గుట్టుతో గుబ్బలపై నీగోరి చిమ్ములు
జట్టిగొన్న నీ సరసమ్ములు
నెట్టనఁ దలఁచుకొని నీకెదురుచూచును
(॥ఇప్పు॥)
పొలసి నీవు సేసిన పొందులు
విలసిల్లు నీమోవి విందులు
కలసి శ్రీవేంకటేశ యలమేల్మంగ
నిలిచి తలఁచుకొని నీకెదురు చూచును
(||pallavi||)
ippuḍu nīvu rām̐gānu iṁta saṁtosiṁchĕm̐ gāni
vuppadillum̐ gorigala nuvviḽḽūrusuṁḍunu
(||ippu||)
maguvadom̐ jĕppĕṁpinamāḍalu
tagula nīvu sesina tammivāḍulu
sāgisi jūjālāḍina soḍulu
nigiḍi talam̐sugŏni nīgĕduru sūsunu
(||ippu||)
suṭṭamavai nī vaṁpina sŏmmulu
guṭṭudo gubbalabai nīgori simmulu
jaṭṭigŏnna nī sarasammulu
nĕṭṭanam̐ dalam̐sugŏni nīgĕdurusūsunu
(||ippu||)
pŏlasi nīvu sesina pŏṁdulu
vilasillu nīmovi viṁdulu
kalasi śhrīveṁkaḍeśha yalamelmaṁga
nilisi talam̐sugŏni nīgĕduru sūsunu