Ippudu namminavaari kimtagamte sulabhumdu

ఇప్పుడు నమ్మినవారి కింతకంటె సులభుఁడు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడు నమ్మినవారి కింతకంటె సులభుఁడు
తప్పక తలఁచుకోరో దైవజ్ఞులాలా

(॥ఇప్పుడు॥)
సీతావిరహ మోర్చి శ్రీరామచంద్రుడు
భ్రాతయైన లక్ష్మణునిఁ బాయలేఁ డాయ
ఆతుమ బంధువులకంటె నండఁ బాయక కొలిచె
నీతికైంకర్యపరుఁడే నిజబంధుఁ డాయెను

(॥ఇప్పుడు॥)
వడి దశరథుఁ బాసి వచ్చిన రాఘవునికి
కడు సుగ్రీవుచుట్టరికము గలిగె
తడయక కనిపించె తల్లిదండ్రులకంటె
నడరిన సేవకుఁడె యంతరంగుఁ డాయెను

(॥ఇప్పుడు॥)
మచ్చికతో భరతునిమాట మీఱినరాముఁడు
మెచ్చి విభీషణు భక్తి మీఱలేఁ డాయె
అచ్చపు శ్రీవేంకటేశు అన్నఁదమ్ములకంటెను
తచ్చి శరణాగతుఁడె తగ నిష్టు డాయెను

(||pallavi||)
ippuḍu namminavāri kiṁtagaṁṭĕ sulabhum̐ḍu
tappaga talam̐sugoro daivajñulālā

(||ippuḍu||)
sīdāviraha morsi śhrīrāmasaṁdruḍu
bhrādayaina lakṣhmaṇunim̐ bāyalem̐ ḍāya
āduma baṁdhuvulagaṁṭĕ naṁḍam̐ bāyaga kŏlisĕ
nīdigaiṁkaryabarum̐ḍe nijabaṁdhum̐ ḍāyĕnu

(||ippuḍu||)
vaḍi daśharathum̐ bāsi vachchina rāghavunigi
kaḍu sugrīvusuṭṭarigamu galigĕ
taḍayaga kanibiṁchĕ tallidaṁḍrulagaṁṭĕ
naḍarina sevagum̐ḍĕ yaṁtaraṁgum̐ ḍāyĕnu

(||ippuḍu||)
machchigado bharadunimāḍa mīṟinarāmum̐ḍu
mĕchchi vibhīṣhaṇu bhakti mīṟalem̐ ḍāyĕ
achchabu śhrīveṁkaḍeśhu annam̐dammulagaṁṭĕnu
tachchi śharaṇāgadum̐ḍĕ taga niṣhṭu ḍāyĕnu