Ippudu maa yimtigaada nemmelellaa naadevu

ఇప్పుడు మా యింటికాడ నెమ్మెలెల్లా నాడేవు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడు మా యింటికాడ నెమ్మెలెల్లా నాడేవు
అప్పుడు చూతమువో నీ ‌ఆయితము లెల్లను

(॥ఇప్పు॥)
గుఱుతులై నీమాటలు గుండెలలో నుండఁగాను
మఱతురా గొల్లెతలు మరియెంతైనా
మెఱసి రేపల్లె చొచ్చి తఱితో వెళ్లఁగ రాదా
చెఱఁగు వట్టి నిన్నేమి సేసేరో చూతువు

(॥ఇప్పు॥)
తారుకాణై నీచేఁతలు తమమేనుల మండఁగ
వూరకె చెలులు నిన్ను దూరకుందురా
మేరతో వారిముంగిళ్లు మెట్టి యటు రారాదా
కోరి నిన్ను వారెంత కొసరేరో విందువు

(॥ఇప్పు॥)
తడఁబడి నీతమ్మ దవడల నుండఁగాను
విడుతురా కాంతలు నీవెంటనే రాక
యెడయక శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
తడవరాదా వారితలఁపులు మెత్తువు

(||pallavi||)
ippuḍu mā yiṁṭigāḍa nĕmmĕlĕllā nāḍevu
appuḍu sūdamuvo nī ‌āyidamu lĕllanu

(||ippu||)
guṟudulai nīmāḍalu guṁḍĕlalo nuṁḍam̐gānu
maṟadurā gŏllĕdalu mariyĕṁtainā
mĕṟasi reballĕ sŏchchi taṟido vĕḽlam̐ga rādā
sĕṟam̐gu vaṭṭi ninnemi sesero sūduvu

(||ippu||)
tārugāṇai nīsem̐talu tamamenula maṁḍam̐ga
vūragĕ sĕlulu ninnu dūraguṁdurā
merado vārimuṁgiḽlu mĕṭṭi yaḍu rārādā
kori ninnu vārĕṁta kŏsarero viṁduvu

(||ippu||)
taḍam̐baḍi nīdamma davaḍala nuṁḍam̐gānu
viḍudurā kāṁtalu nīvĕṁṭane rāga
yĕḍayaga śhrī veṁkaḍeśha nannu nelidivi
taḍavarādā vāridalam̐pulu mĕttuvu