Ippudu galugu buddi appudu ledaa

ఇప్పుడు గలుగు బుద్ది అప్పుడు లేదా
Language

(॥పల్లవి॥)
ఇప్పుడు గలుగు బుద్ది అప్పుడు లేదా
తప్పక మెలఁగితేను తగునని ఆడరా

(॥ఇప్పు॥)
వొద్దనుండి యాకె నిన్ను వొకటొకటె ఆడఁగా
గద్దించేవు బొమ్మలను కాంతను నీవు
కొద్దిమీర మింతేసి కోపకాఁడవు తొల్లె
వొద్దికైన వోజతోడ నుండఁగరాదా

(॥ఇప్పు॥)
నంటున నీ మోము చూచి నవ్వులెల్లా నవ్వఁగాను
కంటగించి కసరేవు కాంతను నీవు
ఇంటిలోనఁ బంతములు ఇంత నెరపేవాఁడవు
జంటవై అందరు మెచ్చ చక్క నుండరాదా

(॥ఇప్పు॥)
శ్రీ వేంకటేశ నిన్నుఁ జేరి కాఁగిలించుకోఁగా
కావరించి వొరసేవు కాంతను నీవు
యీవల నన్నేలితివి ఇంతగలవాఁడవు
మా వాఁడ విందరి నడుమనే వుండరాదా

(||pallavi||)
ippuḍu galugu buddi appuḍu ledā
tappaga mĕlam̐gidenu tagunani āḍarā

(||ippu||)
vŏddanuṁḍi yāgĕ ninnu vŏgaḍŏgaḍĕ āḍam̐gā
gaddiṁchevu bŏmmalanu kāṁtanu nīvu
kŏddimīra miṁtesi kobagām̐ḍavu tŏllĕ
vŏddigaina vojadoḍa nuṁḍam̐garādā

(||ippu||)
naṁṭuna nī momu sūsi navvulĕllā navvam̐gānu
kaṁṭagiṁchi kasarevu kāṁtanu nīvu
iṁṭilonam̐ baṁtamulu iṁta nĕrabevām̐ḍavu
jaṁṭavai aṁdaru mĕchcha sakka nuṁḍarādā

(||ippu||)
śhrī veṁkaḍeśha ninnum̐ jeri kām̐giliṁchugom̐gā
kāvariṁchi vŏrasevu kāṁtanu nīvu
yīvala nannelidivi iṁtagalavām̐ḍavu
mā vām̐ḍa viṁdari naḍumane vuṁḍarādā