ఇప్పుడు దయదలచే విది ముందే యెఱఁగవా
(॥పల్లవి॥)
ఇప్పుడు దయదలచే విది ముందే యెఱఁగవా
వుప్పతిల్లు మోహమున వుమ్మగిలేవు
(॥ఇపుడు॥)
చెక్కునొక్కి ప్రియములుచెప వాకెకు నీవు
తక్కక నీకోనగోరు దాకెనంటాను
యిక్కువైననీవుంగర మిచ్చి బుజ్జగించేవు
పక్కటిల్లుచన్నులు పిసికితినంటాను
(॥ఇపుడు॥)
వొట్టుచు దమ్ములమిడి వూరడించే వాపను
అట్టె నీపాదాలు గుద్ది యలసెనంటా
పట్టి కాగిలించుక నీ పక్క బెట్టుకొనేవు
నెట్టుకొని వేగినంతా నిద్రవొదంటాను
(॥ఇపుడు॥)
పచ్చడముగప్పాకెను పలువరు లాలించేవు
కుచ్చెల వట్టితే జారె గొంగటాను
అచ్చప శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
మెచ్చేవు నన్నేలి కె మెయికోనెనంటాను
(||pallavi||)
ippuḍu dayadalase vidi muṁde yĕṟam̐gavā
vuppadillu mohamuna vummagilevu
(||ibuḍu||)
sĕkkunŏkki priyamulusĕba vāgĕgu nīvu
takkaga nīgonagoru dāgĕnaṁṭānu
yikkuvainanīvuṁgara michchi bujjagiṁchevu
pakkaḍillusannulu pisigidinaṁṭānu
(||ibuḍu||)
vŏṭṭusu dammulamiḍi vūraḍiṁche vābanu
aṭṭĕ nībādālu guddi yalasĕnaṁṭā
paṭṭi kāgiliṁchuga nī pakka bĕṭṭugŏnevu
nĕṭṭugŏni veginaṁtā nidravŏdaṁṭānu
(||ibuḍu||)
pachchaḍamugappāgĕnu paluvaru lāliṁchevu
kuchchĕla vaṭṭide jārĕ gŏṁgaḍānu
achchaba śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
mĕchchevu nanneli kĕ mĕyigonĕnaṁṭānu