ఇప్పుడు దా దక్కెనేమో యెవ్వఁ డెఱుఁగు
(॥పల్లవి॥)
ఇప్పుడు దా దక్కెనేమో యెవ్వఁ డెఱుఁగు
చిప్పిలఁగ నవ్వితేనే సేసినవారు గార(రా?)
(॥ఇప్పు॥)
పొద్దువోక ఆతనితో పొందులు సేసుకొంటా
కొద్దిమీర గోళ్లేల గోడ రాచేవే
అద్దరిపాటు నే రాఁగా నటు కొంకితిరి గాక
వద్ద లేకుంటే కూడినవారు మీరు గారా
(॥ఇప్పు॥)
వంచిన శిరసుతోడ వాడికెలు సేసుకొంటా
మంచమెక్కి పతినేల మరిగించేవే
అంచెల నేఁ గనఁగాను ఆం(అం)తట నున్నారుగాక
ఇంచుకంత మఱఁగైతే ఇట్టె కూడుకొనరా
(॥ఇప్పు॥)
నవ్వి కాఁగిలించుకొంటా నమ్మిక లిప్పించుకొంటా
రవ్వలేల సేసేవే రాఁగా నేఁడు
యివ్వల శ్రీ వేంకటేశుఁ డెనసె నన్నింతలోనె
దవ్వుల నుంటేను పంతాలవారే కారా
(||pallavi||)
ippuḍu dā dakkĕnemo yĕvvam̐ ḍĕṟum̐gu
sippilam̐ga navvidene sesinavāru gāra(rā?)
(||ippu||)
pŏdduvoga ādanido pŏṁdulu sesugŏṁṭā
kŏddimīra goḽlela goḍa rāseve
addaribāḍu ne rām̐gā naḍu kŏṁkidiri gāga
vadda leguṁṭe kūḍinavāru mīru gārā
(||ippu||)
vaṁchina śhirasudoḍa vāḍigĕlu sesugŏṁṭā
maṁchamĕkki padinela marigiṁcheve
aṁchĕla nem̐ ganam̐gānu āṁ(aṁ)taḍa nunnārugāga
iṁchugaṁta maṟam̐gaide iṭṭĕ kūḍugŏnarā
(||ippu||)
navvi kām̐giliṁchugŏṁṭā nammiga lippiṁchugŏṁṭā
ravvalela seseve rām̐gā nem̐ḍu
yivvala śhrī veṁkaḍeśhum̐ ḍĕnasĕ nanniṁtalonĕ
davvula nuṁṭenu paṁtālavāre kārā