Ippudimka nadugare yemaneeni

ఇప్పుడిఁక నడుగరే యేమనీని
Language

(॥పల్లవి॥)
ఇప్పుడిఁక నడుగరే యేమనీని
రెప్పలెత్తి చూడకుంటే రేపే మాపాయెను

(॥ఇప॥)
అప్పటినుండియు విభుఁడక్కడనే వుండఁగాను
కప్పురము నోటికి కారమై తోఁచె
చిప్పిలుఁ దనమాటలు చెవులుసోఁకకుండఁగా
దప్పికిఁ గొన్నపన్నీరు తానే వుడుకాయను

(॥ఇప॥)
నగుతా నాతోఁదాను నంటు చూపకుండఁగాను
పొగరుఁ గస్తూరిపోఁత పోగులాయను
పగటునఁ బాన్పుపైఁ దాఁ బవ్వళించకుండఁగాను
జిగిఁ గట్టిన చెంగావిచీరే వెట్టాయను

(॥ఇప॥)
శ్రీ వేంకటేశ్వరుఁడు చేతికి లోనుగాఁగా
వేవేలు భోగములు వేడుకాయను
యీవేళఁ దా నన్నుఁ గూడి ఇన్నిటా మన్నించఁగాను
కావలసిన పనులు కడుమంచివాయను

(||pallavi||)
ippuḍim̐ka naḍugare yemanīni
rĕppalĕtti sūḍaguṁṭe rebe mābāyĕnu

(||iba||)
appaḍinuṁḍiyu vibhum̐ḍakkaḍane vuṁḍam̐gānu
kappuramu noḍigi kāramai tom̐sĕ
sippilum̐ danamāḍalu sĕvulusom̐kaguṁḍam̐gā
dappigim̐ gŏnnabannīru tāne vuḍugāyanu

(||iba||)
nagudā nādom̐dānu naṁṭu sūbaguṁḍam̐gānu
pŏgarum̐ gastūribom̐ta pogulāyanu
pagaḍunam̐ bānpubaim̐ dām̐ bavvaḽiṁchaguṁḍam̐gānu
jigim̐ gaṭṭina sĕṁgāvisīre vĕṭṭāyanu

(||iba||)
śhrī veṁkaḍeśhvarum̐ḍu sedigi lonugām̐gā
vevelu bhogamulu veḍugāyanu
yīveḽam̐ dā nannum̐ gūḍi inniḍā manniṁcham̐gānu
kāvalasina panulu kaḍumaṁchivāyanu