ఇప్పుడెట్టు వస్తివే మాయింట నాతఁ డుండఁగాను
(॥పల్లవి॥)
ఇప్పుడెట్టు వస్తివే మాయింట నాతఁ డుండఁగాను
తప్పక కొలువుసేయ నప్పు డేమరితివా
(॥ఇపు॥)
ఆమ్మరో నీవరునాఁ డాతనికి బత్తివేసి
నెమ్మదిఁ బాదా లోత్తనేరవైతివా
సమ్మతి నీతోడ సరమాడేటివేళ
నిమ్మలాన మోము చూడ నీవు మఱచితివా
(॥ఇపు॥)
కందువ నాతఁడు నీకాఁగిటలో నున్నపుడు
అది నవ్వక పరాకులైవుంటివా
పొందులుసేసి భోగించె తఱవాత
ముందుముందే మాటాడక మోసపోయివుంటివా
(॥ఇపు॥)
పానుపుపై నీతఁ డిట్టె పక్కనీకు నుండఎగాను
వూని వూడిగాలు సేయ నొల్లవైతివా
ఆనుక శ్రీవేంకటేశుఁ డాతఁడే వచ్చి నన్నేలె
యేనలమేలు మంగ నన్నేంచుకోవైతివా
(||pallavi||)
ippuḍĕṭṭu vastive māyiṁṭa nādam̐ ḍuṁḍam̐gānu
tappaga kŏluvuseya nappu ḍemaridivā
(||ibu||)
āmmaro nīvarunām̐ ḍādanigi battivesi
nĕmmadim̐ bādā lottaneravaidivā
sammadi nīdoḍa saramāḍeḍiveḽa
nimmalāna momu sūḍa nīvu maṟasidivā
(||ibu||)
kaṁduva nādam̐ḍu nīgām̐giḍalo nunnabuḍu
adi navvaga parāgulaivuṁṭivā
pŏṁdulusesi bhogiṁchĕ taṟavāda
muṁdumuṁde māḍāḍaga mosaboyivuṁṭivā
(||ibu||)
pānububai nīdam̐ ḍiṭṭĕ pakkanīgu nuṁḍægānu
vūni vūḍigālu seya nŏllavaidivā
ānuga śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe vachchi nannelĕ
yenalamelu maṁga nanneṁchugovaidivā