ఇప్పుడేమి వేగిరము యిన్నియు నయ్యీఁ గాక
(॥పల్లవి॥)
ఇప్పుడేమి వేగిరము యిన్నియు నయ్యీఁ గాక
కప్పుర మవదరించు కానుక వట్టినది
(॥॥)
అలసివచ్చిన నిన్నునంత మాటాడించనేల
వెలయఁగఁ బవళించు విసరే నేను
వలపులదిష్టిదాఁకి వాడివున్నది నీమోము
బలిమినైనా నిద్రించు పాదాలు గుద్దేను
(॥॥)
చెమటవెట్టినమేను చేతుల నంటఁగనేల
తమితో నూరుకుండు గందము పూసెను
సమరతి నోలలాడి జారివున్న దిదె కొప్పు
అమర నాతొడపైఁ బెట్టలరులు నించేను
(॥॥)
పచ్చిపులకలచెక్కుపై గోర నూఁదనేల
గచ్చులముసుఁ గిడుకో కాఁగిలించేను
కుచ్చి శ్రీ వేంకటేశుఁడ కూడితివి నన్ను నిట్టె
తచ్చి నాకు మో వొసఁగు దప్పులు దీర్చేను
(||pallavi||)
ippuḍemi vegiramu yinniyu nayyīm̐ gāga
kappura mavadariṁchu kānuga vaṭṭinadi
(||||)
alasivachchina ninnunaṁta māḍāḍiṁchanela
vĕlayam̐gam̐ bavaḽiṁchu visare nenu
valabuladiṣhṭidām̐ki vāḍivunnadi nīmomu
baliminainā nidriṁchu pādālu guddenu
(||||)
sĕmaḍavĕṭṭinamenu sedula naṁṭam̐ganela
tamido nūruguṁḍu gaṁdamu pūsĕnu
samaradi nolalāḍi jārivunna didĕ kŏppu
amara nādŏḍabaim̐ bĕṭṭalarulu niṁchenu
(||||)
pachchibulagalasĕkkubai gora nūm̐danela
gachchulamusum̐ giḍugo kām̐giliṁchenu
kuchchi śhrī veṁkaḍeśhum̐ḍa kūḍidivi nannu niṭṭĕ
tachchi nāgu mo vŏsam̐gu dappulu dīrsenu