Ippudela tamagamu yimtigi vattuvu gaani

ఇప్పుడేల తమకము యింటికి వత్తువు గాని
Language

(॥పల్లవి॥)
ఇప్పుడేల తమకము యింటికి వత్తువు గాని
చిప్పిలె వలపు విూదఁ సెల విచ్చేఁ గాని

(॥ఇప్పుడేల॥)
సారె సారెఁ బొగడకు నందు లెల్లా నదరీని
కూరిమి నీలోన నిందు కొందువు గాని
పారి పారి మెచ్చకుమీ బారగించీ పులకలు
కోరికె లేమి గల్లాను గుక్కుకొందు గాని

(॥ఇప్పుడేల॥)
నిక్కి నిక్కి చూడకుమీ నిలువెల్లాఁ జెమరించీ
యిక్కువకు మన మీఁదెత్తుదు గాని
నక్కువడ నవ్వకుమీ నడుమెల్ల బడగయ్యీని
వుక్కున రేపటి కిందు కునుతువు గాని

(॥ఇప్పుడేల॥)
కన్నులనే మొక్కకుమీ కాలిగోరు వణఁకీని
అన్నువ పిడికిటిలో నణఁతువు గాని
యిన్నిటా శ్రీవేంకటేశ యింత సేసి కూడితివి
కన్నచోటఁ జెపకుమీ గారవింతు గాని

(||pallavi||)
ippuḍela tamagamu yiṁṭigi vattuvu gāni
sippilĕ valabu viూdam̐ sĕla vichchem̐ gāni

(||ippuḍela||)
sārĕ sārĕm̐ bŏgaḍagu naṁdu lĕllā nadarīni
kūrimi nīlona niṁdu kŏṁduvu gāni
pāri pāri mĕchchagumī bāragiṁchī pulagalu
korigĕ lemi gallānu gukkugŏṁdu gāni

(||ippuḍela||)
nikki nikki sūḍagumī niluvĕllām̐ jĕmariṁchī
yikkuvagu mana mīm̐dĕttudu gāni
nakkuvaḍa navvagumī naḍumĕlla baḍagayyīni
vukkuna rebaḍi kiṁdu kunuduvu gāni

(||ippuḍela||)
kannulane mŏkkagumī kāligoru vaṇam̐kīni
annuva piḍigiḍilo naṇam̐tuvu gāni
yinniḍā śhrīveṁkaḍeśha yiṁta sesi kūḍidivi
kannasoḍam̐ jĕbagumī gāraviṁtu gāni