ఇప్పుడేల సిగ్గువడే వెరఁగనిదాని వలె
(॥పల్లవి॥)
ఇప్పుడేల సిగ్గువడే వెరఁగనిదాని వలె
ముప్పిరిగొన నిందరిముందరా నీవు
(॥ఇప్పు॥)
పెచ్చురేఁగి యేకతాన పెదవులు పిప్పిగట్ట
మచ్చిక నీతనితోను మాఁటలాడవా
వచ్చి వచ్చి లోలోనే వలపును చల్లి చల్లి
పచ్చిదేర నప్పటిని పకపక నవ్వవా
(॥ఇప్పు॥)
వేడుకతో మంచముపై వేవేలు చందాల
వీడెమిచ్చి మోవితేనె విందువెట్టనా
వాడికతోఁ గొసరుతా వాలికచూపులఁ జూచి
కూడఁబట్టి కాఁగిలించి కుచముల నొత్తనా
(॥ఇప్పు॥)
పరపుపై నీతనితో పచ్చిగాఁ బెనఁగుతాను
పొరలించి పొరలించి పొందుచూపవా
ఇరవై శ్రీవేంకటేశుఁ డిట్టె నన్ను నేలె
సరుసకు వచ్చి నీవు సన్నలెల్లాఁ జేయవా
(||pallavi||)
ippuḍela sigguvaḍe vĕram̐ganidāni valĕ
muppirigŏna niṁdarimuṁdarā nīvu
(||ippu||)
pĕchchurem̐gi yegadāna pĕdavulu pippigaṭṭa
machchiga nīdanidonu mām̐ṭalāḍavā
vachchi vachchi lolone valabunu salli salli
pachchidera nappaḍini pagabaga navvavā
(||ippu||)
veḍugado maṁchamubai vevelu saṁdāla
vīḍĕmichchi movidenĕ viṁduvĕṭṭanā
vāḍigadom̐ gŏsarudā vāligasūbulam̐ jūsi
kūḍam̐baṭṭi kām̐giliṁchi kusamula nŏttanā
(||ippu||)
parabubai nīdanido pachchigām̐ bĕnam̐gudānu
pŏraliṁchi pŏraliṁchi pŏṁdusūbavā
iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannu nelĕ
sarusagu vachchi nīvu sannalĕllām̐ jeyavā