Ippude yinniyum gaaga yimka nennamdu

ఇప్పుడే యిన్నియుఁ గాక యిఁక నెన్నఁడు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే యిన్నియుఁ గాక యిఁక నెన్నఁడు
చెప్పరాని సేఁతలెల్లాఁ జేసుకొనవయ్యా

(॥॥)
వెలఁది విన్నపములు వింటివా నీవు
పలుమారు చిత్తమునఁ బట్టెనా నీకు
అలరినసంతోస మబ్బెనా నేఁడు
కలిగె నీకు లాభము కట్టుకొనవయ్యా

(॥॥)
కొమ్మచేతికాను కందుకొంటివా నీవు
చిమ్ముల నీచేతికిఁ జిక్కెనా నీకు
దిమ్మరి నీకోరికే సిద్దించెనా నేఁడు
వుమ్మడిఁ జేరే మేళ్లు వొప్పుకొనవయ్యా

(॥॥)
కొమలి మోవిచవి గొంటివా నీవు
దామెనరతులు యిట్టె దక్కెనా నీకు
నేమపు శ్రీ వేంకటేశ నేఁడు నన్నేలితివి
కామతంత్రసంపద గనుకొనవయ్యా

(||pallavi||)
ippuḍe yinniyum̐ gāga yim̐ka nĕnnam̐ḍu
sĕpparāni sem̐talĕllām̐ jesugŏnavayyā

(||||)
vĕlam̐di vinnabamulu viṁṭivā nīvu
palumāru sittamunam̐ baṭṭĕnā nīgu
alarinasaṁtosa mabbĕnā nem̐ḍu
kaligĕ nīgu lābhamu kaṭṭugŏnavayyā

(||||)
kŏmmasedigānu kaṁdugŏṁṭivā nīvu
simmula nīsedigim̐ jikkĕnā nīgu
dimmari nīgorige siddiṁchĕnā nem̐ḍu
vummaḍim̐ jere meḽlu vŏppugŏnavayyā

(||||)
kŏmali movisavi gŏṁṭivā nīvu
dāmĕnaradulu yiṭṭĕ dakkĕnā nīgu
nemabu śhrī veṁkaḍeśha nem̐ḍu nannelidivi
kāmadaṁtrasaṁpada ganugŏnavayyā