ఇప్పుడే యేల పెనఁగే వీకెతోను
(॥పల్లవి॥)
ఇప్పుడే యేల పెనఁగే వీకెతోను
లప్పల కప్ర మిచ్చి యలపు దీర్చవయ్యా
(॥ఇప్పుడే॥)
కలకల నవ్వుతాను కాంత పరువున వచ్చి
బలిమిఁ గౌఁగిట నిన్ను నలమఁగాను
వెలయఁ గొప్పు వీడి విరులు జల్లన రాలె
ములువాఁడి గోళ్ళ దువ్వి ముడువవయ్యా
(॥ఇప్పుడే॥)
వొట్టు వెట్టి పోకు మని వొడివట్టుకొని నిన్ను
దిట్టయై తెరలోనికిఁ దియ్యఁ గాను
గుట్టునఁ బయ్య దెడలి కుచములు గానవచ్చె
జట్టిగొని వూరడించి చక్కఁ బెట్టవయ్యా
(॥ఇప్పుడే॥)
గయ్యాళితనము చేసి కళ లంటి రతిసేసి
నెయ్యపు మోవితేనెలు నించఁగాను
చయ్యన శ్రీవేంకటేశ సరులెల్లాఁ బెనఁగొనె
యియ్యడఁ జిక్కు దీరిచి యేలుకొనవయ్యా
(||pallavi||)
ippuḍe yela pĕnam̐ge vīgĕdonu
lappala kapra michchi yalabu dīrsavayyā
(||ippuḍe||)
kalagala navvudānu kāṁta paruvuna vachchi
balimim̐ gaum̐giḍa ninnu nalamam̐gānu
vĕlayam̐ gŏppu vīḍi virulu jallana rālĕ
muluvām̐ḍi goḽḽa duvvi muḍuvavayyā
(||ippuḍe||)
vŏṭṭu vĕṭṭi pogu mani vŏḍivaṭṭugŏni ninnu
diṭṭayai tĕralonigim̐ diyyam̐ gānu
guṭṭunam̐ bayya dĕḍali kusamulu gānavachchĕ
jaṭṭigŏni vūraḍiṁchi sakkam̐ bĕṭṭavayyā
(||ippuḍe||)
gayyāḽidanamu sesi kaḽa laṁṭi radisesi
nĕyyabu movidenĕlu niṁcham̐gānu
sayyana śhrīveṁkaḍeśha sarulĕllām̐ bĕnam̐gŏnĕ
yiyyaḍam̐ jikku dīrisi yelugŏnavayyā