ఇప్పుడే విచారించుక ఇంతిఁ గరుణించవయ్యా
(॥పల్లవి॥)
ఇప్పుడే విచారించుక ఇంతిఁ గరుణించవయ్యా
వుప్పతించితే నెట్లుండునో నీ మనసు
(॥ఇప్పు॥)
అంగన నిన్నేమైనా నౌఁగా దనఁగలదా
చెంగట నేమి సేసినాఁ జేతువు గాక
కొంగు వట్టి తీసి మరి కొసరగఁ జూచితేను
యెంగిలి పెదవి సోఁకి యేరీతౌనో మనసు
(॥ఇప్పు॥)
మగువ నీగుణములు మానుపఁగఁ గలదా
జిగి నాకెభాగ్యము నీచేతిదిగాక
పగటును నిందుకుఁగా పట్టి పెనఁగఁబోతే
చిగురుఁబాదాలు దాఁకి సిగ్గౌనో మనసు
(॥ఇప్పు॥)
వెలఁది నిన్నిటు గూడి వేసరించఁ గలదా
వలపు గలిగినంతే వాడికెగాక
అల కడపరాయఁడవై శ్రీవేంకటేశ్వర
బలిమి మన్నించితి వేభావమౌనో మనసు
(||pallavi||)
ippuḍe visāriṁchuga iṁtim̐ garuṇiṁchavayyā
vuppadiṁchide nĕṭluṁḍuno nī manasu
(||ippu||)
aṁgana ninnemainā naum̐gā danam̐galadā
sĕṁgaḍa nemi sesinām̐ jeduvu gāga
kŏṁgu vaṭṭi tīsi mari kŏsaragam̐ jūsidenu
yĕṁgili pĕdavi som̐ki yerīdauno manasu
(||ippu||)
maguva nīguṇamulu mānubam̐gam̐ galadā
jigi nāgĕbhāgyamu nīsedidigāga
pagaḍunu niṁdugum̐gā paṭṭi pĕnam̐gam̐bode
sigurum̐bādālu dām̐ki siggauno manasu
(||ippu||)
vĕlam̐di ninniḍu gūḍi vesariṁcham̐ galadā
valabu galiginaṁte vāḍigĕgāga
ala kaḍabarāyam̐ḍavai śhrīveṁkaḍeśhvara
balimi manniṁchidi vebhāvamauno manasu