Ippude vinnavimchidi ninniyu neegu

ఇప్పుడే విన్నవించితి నిన్నియు నీకు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే విన్నవించితి నిన్నియు నీకు
తప్పులేమి గలిగిన దయఁ జూడుమిఁకను

(॥ఇప॥)
పొంతనుండి నిచ్చా నీతో పొందులు సేసేఁగాని
యింతంతని నీ చిత్తమెఱఁగ నేను
మంతనాన నెన్నైన మాయలవాఁడవు నీవు
పంతమెఱఁగను నాభావమెల్ల నీది

(॥ఇప॥)
అలరి యెప్పుడు నీకు నాలనై వుండుదుఁ గాని
చెలఁగి యేమి సేసేవో తెలియ నేను
నెలకొని యిన్నిటాను నీయిచ్చరాజవు నీకు
చలమెఱఁగను నాజవ్వనము నీది

(॥ఇప॥)
సారెకుఁ గాఁగిటఁ గూడి సంతోషించుకొందుఁ గాని
నేరుపు నీ గుణాలెంచ నేరను నేను
చేరువ వరములిచ్చే శ్రీ వేంకటేశుఁడవు నే
బీరము లెఱఁగను నాబిరుదెల్ల నీది

(||pallavi||)
ippuḍe vinnaviṁchidi ninniyu nīgu
tappulemi galigina dayam̐ jūḍumim̐kanu

(||iba||)
pŏṁtanuṁḍi nichchā nīdo pŏṁdulu sesem̐gāni
yiṁtaṁtani nī sittamĕṟam̐ga nenu
maṁtanāna nĕnnaina māyalavām̐ḍavu nīvu
paṁtamĕṟam̐ganu nābhāvamĕlla nīdi

(||iba||)
alari yĕppuḍu nīgu nālanai vuṁḍudum̐ gāni
sĕlam̐gi yemi sesevo tĕliya nenu
nĕlagŏni yinniḍānu nīyichcharājavu nīgu
salamĕṟam̐ganu nājavvanamu nīdi

(||iba||)
sārĕgum̐ gām̐giḍam̐ gūḍi saṁtoṣhiṁchugŏṁdum̐ gāni
nerubu nī guṇālĕṁcha neranu nenu
seruva varamulichche śhrī veṁkaḍeśhum̐ḍavu ne
bīramu lĕṟam̐ganu nābirudĕlla nīdi