ఇప్పుడే విన్నవించితి నెఱుఁగుకొందువుగాని
(॥పల్లవి॥)
ఇప్పుడే విన్నవించితి నెఱుఁగుకొందువుగాని
తప్పితే నలులమోఁత తమికిఁ(కిం?)చీఁ జుమ్మీ
(॥ఇప్పు॥)
బలిమి నింతి నీవు పాసివుండేవుగనక
తలఁపఁ గప్రపువేఁడిఁ దాఁకీఁజుమ్మీ
నలువంకసెలవులనవ్వక నీవుండితేను
కలువపూవుటమ్ములగాలి వారీఁజుమ్మీ
(॥ఇప్పు॥)
చేరి చెనకఁగ నీవు సిగ్గువడేవు గనక
సారెకు వెన్నెల వడచల్లీఁజుమ్మీ
గారవించి యాపె యిట్టె కాఁగిలించకుండితేను
నారుకొని చిగురు మొనలుచూసీఁజుమ్మీ
(॥ఇప్పు॥)
మొక్కలాన నీ వవ్వలిమోమయ్యేవు గనక
నిక్కి కోయిలలరొద నిండీఁజుమ్మీ
గక్కన శ్రీవేంకటేశ కలసితి వీకె నిట్టె
కక్కసించితే మదనకళలందీఁజుమ్మీ
(||pallavi||)
ippuḍe vinnaviṁchidi nĕṟum̐gugŏṁduvugāni
tappide nalulamom̐ta tamigim̐(kiṁ?)sīm̐ jummī
(||ippu||)
balimi niṁti nīvu pāsivuṁḍevuganaga
talam̐pam̐ gaprabuvem̐ḍim̐ dām̐kīm̐jummī
naluvaṁkasĕlavulanavvaga nīvuṁḍidenu
kaluvabūvuḍammulagāli vārīm̐jummī
(||ippu||)
seri sĕnagam̐ga nīvu sigguvaḍevu ganaga
sārĕgu vĕnnĕla vaḍasallīm̐jummī
gāraviṁchi yābĕ yiṭṭĕ kām̐giliṁchaguṁḍidenu
nārugŏni siguru mŏnalusūsīm̐jummī
(||ippu||)
mŏkkalāna nī vavvalimomayyevu ganaga
nikki koyilalarŏda niṁḍīm̐jummī
gakkana śhrīveṁkaḍeśha kalasidi vīgĕ niṭṭĕ
kakkasiṁchide madanagaḽalaṁdīm̐jummī