Ippude vinnavimchidi nemchugo meemdadiyettu

ఇప్పుడే విన్నవించితి నెంచుకో మీఁదటియెత్తు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే విన్నవించితి నెంచుకో మీఁదటియెత్తు
వొప్పుగ ధీరుఁడవైతే నొనరు నా కాఁగిట

(॥॥)
నాతో మాటాడఁగ నీనాతు లేమందురో నిన్ను
చేతులెత్తి యేమేమి సేతురో
యీతలనాతల నిన్ను నెక్కడనుండి చూచేరో
బీతి లేనివాఁడవైతే పెనఁగు నాతోను

(॥॥)
నీవు నాచన్న లంటఁగ నిన్నేమందురో వారు
వావాత నెన్నేసి నీకు రేఁతురో
యీవేళ మనమాఁటలు యేడ వింటానున్నారో
ఆవుద్దండాల కోపితే నండకు రా నీవు

(॥॥)
యీడ నిట్టె వుండఁగా నెంత సాదింతురో తాము
కూడితి శ్రీ వేంకటేశ కోరి నన్నును
వీడే లియ్య నేడు నిన్ను వెదుకుతానున్నారో
నీడాక చూపనోపితే నెట్టుకో మాయింటను

(||pallavi||)
ippuḍe vinnaviṁchidi nĕṁchugo mīm̐daḍiyĕttu
vŏppuga dhīrum̐ḍavaide nŏnaru nā kām̐giḍa

(||||)
nādo māḍāḍam̐ga nīnādu lemaṁduro ninnu
sedulĕtti yememi seduro
yīdalanādala ninnu nĕkkaḍanuṁḍi sūsero
bīdi lenivām̐ḍavaide pĕnam̐gu nādonu

(||||)
nīvu nāsanna laṁṭam̐ga ninnemaṁduro vāru
vāvāda nĕnnesi nīgu rem̐turo
yīveḽa manamām̐ṭalu yeḍa viṁṭānunnāro
āvuddaṁḍāla kobide naṁḍagu rā nīvu

(||||)
yīḍa niṭṭĕ vuṁḍam̐gā nĕṁta sādiṁturo tāmu
kūḍidi śhrī veṁkaḍeśha kori nannunu
vīḍe liyya neḍu ninnu vĕdugudānunnāro
nīḍāga sūbanobide nĕṭṭugo māyiṁṭanu