ఇప్పుడే విన్నవించితి మెగ్గులువట్టేవుగన
(॥పల్లవి॥)
ఇప్పుడే విన్నవించితి మెగ్గులువట్టేవుగన
వుప్పతించి మామీఁద నొలవేసేవు సుమ్మీ
(॥॥)
కొప్పుల దువ్వేవు నీవు కొంగేల పట్టేవు నన్ను
యిప్పుడే నీవద్దిచెలులెల్లా నవ్వఁగా
కప్పి నీపై నామేనికస్తురిబేంట్లు రాలీ
అప్పుడు మమ్మేమైనా నాడుకొనేవుసుమ్మీ
(॥॥)
చెక్కులేల నొక్కేవు చెయ్యేల వేసేవు నాపై
గుక్కక సవతులెల్లా గొణఁగఁగాను
చిక్కనినాగుబ్బలపై చెమట నామేననంటే
చొక్కుచు మామీఁద నీవు సొలసేవుసుమ్మీ
(॥॥)
కాయమేల నిమిరేవు కాఁగిటనేల నించేవు
పాయపు పెండ్లికూఁతులు పంగించఁగా
యీయెడ శ్రీవేంకటేశ యేనలమేలుమంగను
చాయలకే కూడితివి జకించేవుసుమ్మీ
(||pallavi||)
ippuḍe vinnaviṁchidi mĕgguluvaṭṭevugana
vuppadiṁchi māmīm̐da nŏlavesevu summī
(||||)
kŏppula duvvevu nīvu kŏṁgela paṭṭevu nannu
yippuḍe nīvaddisĕlulĕllā navvam̐gā
kappi nībai nāmenigasturibeṁṭlu rālī
appuḍu mammemainā nāḍugŏnevusummī
(||||)
sĕkkulela nŏkkevu sĕyyela vesevu nābai
gukkaga savadulĕllā gŏṇam̐gam̐gānu
sikkanināgubbalabai sĕmaḍa nāmenanaṁṭe
sŏkkusu māmīm̐da nīvu sŏlasevusummī
(||||)
kāyamela nimirevu kām̐giḍanela niṁchevu
pāyabu pĕṁḍligūm̐tulu paṁgiṁcham̐gā
yīyĕḍa śhrīveṁkaḍeśha yenalamelumaṁganu
sāyalage kūḍidivi jagiṁchevusummī