Ippude vegiramela innidigini

ఇప్పుడే వేగిరమేల ఇన్నిటికిని
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే వేగిరమేల ఇన్నిటికిని
కప్పురమిచ్చే వేళ కనిపించేఁగాని

(॥ఇప్పు॥)
కాంతమీఁద నీకునిట్టెకడుమోహమై వుండఁగా
యెంత నే విన్నవించినా యితవయ్యీనా
ఇంత గలితే నీవు మాఇంటికి వచ్చేవేళ
దొంతరనానేరుపులు తోడుచూపేఁగాని

(॥ఇప్పు॥)
వుమ్మడి నాపె నీవును వొడివట్టి పెనఁగఁగ
రమ్మని నేఁ బిలిచితేరతికెక్కీనా
సమ్మతైతేఁ గనక నీసరసమాడేటివేళ
పమ్మి నా ప్రియములెల్లఁ బచరించేఁగాని

(॥ఇప్పు॥)
మరిగిమఱఁదలిపై మనసువెట్టుకుండఁగ
గరిమనేఁబైకొంటే కనుపట్టీనా
అరిది శ్రీవేంకటేశ అలమేలుమంగను నేను
యిరవై నన్నేలితివియిఁక మెచ్చేఁగాని

(||pallavi||)
ippuḍe vegiramela inniḍigini
kappuramichche veḽa kanibiṁchem̐gāni

(||ippu||)
kāṁtamīm̐da nīguniṭṭĕgaḍumohamai vuṁḍam̐gā
yĕṁta ne vinnaviṁchinā yidavayyīnā
iṁta galide nīvu māiṁṭigi vachcheveḽa
dŏṁtaranānerubulu toḍusūbem̐gāni

(||ippu||)
vummaḍi nābĕ nīvunu vŏḍivaṭṭi pĕnam̐gam̐ga
rammani nem̐ bilisideradigĕkkīnā
sammadaidem̐ ganaga nīsarasamāḍeḍiveḽa
pammi nā priyamulĕllam̐ basariṁchem̐gāni

(||ippu||)
marigimaṟam̐dalibai manasuvĕṭṭuguṁḍam̐ga
garimanem̐baigŏṁṭe kanubaṭṭīnā
aridi śhrīveṁkaḍeśha alamelumaṁganu nenu
yiravai nannelidiviyim̐ka mĕchchem̐gāni