ఇప్పుడే వేగిర మేల యిందుకుఁ గాను
(॥పల్లవి॥)
ఇప్పుడే వేగిర మేల యిందుకుఁ గాను
వొప్పగించితిమి వల పోపరో విభుఁడా
(॥ఇప్పుడే॥)
నయగారినీమాటలు నమ్మకుండ నెట్టు వచ్చు
రయమును నీవా రైనరమణులకు
ప్రియము నీవు చెప్పఁగ బిగియఁగ నెట్టు వచ్చు
దయ నీకుఁ గలితేను తానే వచ్చీఁ గాకా
(॥ఇప్పుడే॥)
నంటున నీవు నవ్వఁగ నవ్వకుండ నెట్టు వచ్చు
జంట లైన సేసపాలసతులకును
వెంట నీవుదిరుగఁగ విడువఁగ నెట్టు వచ్చు
యింటికి విచ్చేసినప్పు డెనసేము గాకా
(॥ఇప్పుడే॥)
చేరి కాఁగిలించుకోఁగా సిగ్గువడ నెట్టు వచ్చు
కోరి నీ కెదురు చూచేకొమ్మలకును
ఆరయ శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
యీరీతిఁ గూడఁగ నిన్ను నియ్యకొనేఁ గాకా
(||pallavi||)
ippuḍe vegira mela yiṁdugum̐ gānu
vŏppagiṁchidimi vala pobaro vibhum̐ḍā
(||ippuḍe||)
nayagārinīmāḍalu nammaguṁḍa nĕṭṭu vachchu
rayamunu nīvā rainaramaṇulagu
priyamu nīvu sĕppam̐ga bigiyam̐ga nĕṭṭu vachchu
daya nīgum̐ galidenu tāne vachchīm̐ gāgā
(||ippuḍe||)
naṁṭuna nīvu navvam̐ga navvaguṁḍa nĕṭṭu vachchu
jaṁṭa laina sesabālasadulagunu
vĕṁṭa nīvudirugam̐ga viḍuvam̐ga nĕṭṭu vachchu
yiṁṭigi vichchesinappu ḍĕnasemu gāgā
(||ippuḍe||)
seri kām̐giliṁchugom̐gā sigguvaḍa nĕṭṭu vachchu
kori nī kĕduru sūsegŏmmalagunu
āraya śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
yīrīdim̐ gūḍam̐ga ninnu niyyagŏnem̐ gāgā