Ippude sigguvade vimdaramu numdamgaanu

ఇప్పుడే సిగ్గువడే విందరము నుండఁగాను
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే సిగ్గువడే విందరము నుండఁగాను
ముప్పిరి నేర్చుకొంటివి మునుప నీ సుద్దులు

(॥ఇప్పు॥)
సరసములాడితేను చవివుట్టు వలపులు
తరితీపు సేసితేను తమిరేఁగును
వొరశొరసి నవ్వితే నుల్లములు గరఁగును
సొరిది నీపతి నిటె చొక్కించఁగదవే

(॥ఇప్పు॥)
తప్పకచూచితేను తలకొను నాసలు
నెప్పునఁ బెనఁగితేను నిండు ముదము
దప్పిదేరఁ గొసరితే తతపోఁత లుప్పతిల్లు
చిప్పిల నీ వితనికి సేవసేయఁగదవే

(॥ఇప్పు॥)
సారెసారెఁ జెనకితే సమ్మతించు మనసులు
కోరి కాఁగిలించుకొంటే కూడుఁ బ్రేమము
యీరీతి శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను నింతలోనే
మేరతో నీవునుఁ గూడి మెప్పించఁగదవే

(||pallavi||)
ippuḍe sigguvaḍe viṁdaramu nuṁḍam̐gānu
muppiri nersugŏṁṭivi munuba nī suddulu

(||ippu||)
sarasamulāḍidenu savivuṭṭu valabulu
taridību sesidenu tamirem̐gunu
vŏraśhŏrasi navvide nullamulu garam̐gunu
sŏridi nībadi niḍĕ sŏkkiṁcham̐gadave

(||ippu||)
tappagasūsidenu talagŏnu nāsalu
nĕppunam̐ bĕnam̐gidenu niṁḍu mudamu
dappideram̐ gŏsaride tadabom̐ta luppadillu
sippila nī vidanigi sevaseyam̐gadave

(||ippu||)
sārĕsārĕm̐ jĕnagide sammadiṁchu manasulu
kori kām̐giliṁchugŏṁṭe kūḍum̐ bremamu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu niṁtalone
merado nīvunum̐ gūḍi mĕppiṁcham̐gadave