ఇప్పుడే చెప్పఁగవలె యెదలోనఁ గల మాట
(॥పల్లవి॥)
ఇప్పుడే చెప్పఁగవలె యెదలోనఁ గల మాట
తప్పకుండా బాసగొని తగిలేఁ జుమ్మీ
(॥ఇప్పు॥)
వద్దనవచ్చునా నిన్ను వడిఁ గొంగువట్టఁగాను
వొద్దిక మాటాడ కూరకుండుదుఁగాక
బద్దుల నీ విదిగాక పానుపు పైకి రమ్మంటే
పెద్దరికమన్నా నను పెనఁగేఁజుమ్మీ
(॥ఇప్పు॥)
కోపించవచ్చునా నిన్ను కొసరి మేలమాడితే
వొపినట్టె వొద్ద నిలుచుందుఁగాక
కైపుల నీ విదిగాక కాఁగిలించుకొమ్మంటే
పైపైఁ దగదన్నా నను పదరుదుఁజుమ్మీ
(॥ఇప్పు॥)
తిట్టఁగవచ్చునా నిన్ను తేజాన నన్నుఁ గూడితే
యిట్టె శ్రీవేంకటేశ యెనతుఁగాక
రట్టుసేసి యిదిగాక గుట్టున నవ్వేనంటే
దిట్ట యిదియన్నా నను దీకొందుఁజుమ్మీ
(||pallavi||)
ippuḍe sĕppam̐gavalĕ yĕdalonam̐ gala māḍa
tappaguṁḍā bāsagŏni tagilem̐ jummī
(||ippu||)
vaddanavachchunā ninnu vaḍim̐ gŏṁguvaṭṭam̐gānu
vŏddiga māḍāḍa kūraguṁḍudum̐gāga
baddula nī vidigāga pānubu paigi rammaṁṭe
pĕddarigamannā nanu pĕnam̐gem̐jummī
(||ippu||)
kobiṁchavachchunā ninnu kŏsari melamāḍide
vŏbinaṭṭĕ vŏdda nilusuṁdum̐gāga
kaibula nī vidigāga kām̐giliṁchugŏmmaṁṭe
paibaim̐ dagadannā nanu padarudum̐jummī
(||ippu||)
tiṭṭam̐gavachchunā ninnu tejāna nannum̐ gūḍide
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕnadum̐gāga
raṭṭusesi yidigāga guṭṭuna navvenaṁṭe
diṭṭa yidiyannā nanu dīgŏṁdum̐jummī