ఇప్పుడె సవతితన మేరుపడె నాకు నేఁడు
(॥పల్లవి॥)
ఇప్పుడె సవతితన మేరుపడె నాకు నేఁడు
తప్పులేదు యిఁక నన్నుఁ దడవక పోవే
(॥ఇప్పుడె॥)
ఆతఁడె నీమీఁదిబత్తి అవు నట యిఁక నీవు
యీతల వెంగెము లాడి యేమి సేసేవే
కాతరాన మా గుట్టు కడు బయట వేసితి
భీతి వాసె నిఁక నీవు బీరము లాడకువే
(॥ఇప్పుడె॥)
వూరకె మా యింట నాతఁడున్నాఁ డంటా నాడేవు
సారెకు నీవిఁక మరి సాదించే దేమే
యీరీతి మా చలి వాపి యింత ఱట్టు సేసితివి
తేరెఁ బను లన్నియును తెగ నాడేఁ బదవే
(॥ఇప్పుడె॥)
శ్రీవెంకటేశ్వరుడు నాకుఁ జేరి వొప్పగించితివి
కావించి నీ వాడేనింద గట్టాయ లేవే
వేవేగ నాతఁడు నన్ను విచ్చనవిడిఁ గూడెను
దేవరే మేలు సేసె తెరమరఁ గేఁటికే
(||pallavi||)
ippuḍĕ savadidana merubaḍĕ nāgu nem̐ḍu
tappuledu yim̐ka nannum̐ daḍavaga pove
(||ippuḍĕ||)
ādam̐ḍĕ nīmīm̐dibatti avu naḍa yim̐ka nīvu
yīdala vĕṁgĕmu lāḍi yemi seseve
kādarāna mā guṭṭu kaḍu bayaḍa vesidi
bhīdi vāsĕ nim̐ka nīvu bīramu lāḍaguve
(||ippuḍĕ||)
vūragĕ mā yiṁṭa nādam̐ḍunnām̐ ḍaṁṭā nāḍevu
sārĕgu nīvim̐ka mari sādiṁche deme
yīrīdi mā sali vābi yiṁta ṟaṭṭu sesidivi
terĕm̐ banu lanniyunu tĕga nāḍem̐ badave
(||ippuḍĕ||)
śhrīvĕṁkaḍeśhvaruḍu nāgum̐ jeri vŏppagiṁchidivi
kāviṁchi nī vāḍeniṁda gaṭṭāya leve
vevega nādam̐ḍu nannu vichchanaviḍim̐ gūḍĕnu
devare melu sesĕ tĕramaram̐ gem̐ṭige