Ippude ninnimta sese nimpula toda

ఇప్పుడే నిన్నింత సేసే నింపుల తోడ
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే నిన్నింత సేసే నింపుల తోడ
నెప్పునఁ జెప్పఁ గదవె నీవున్న జాడ

(॥ఇప్పుడే॥)
గాఁటపుఁ దురుముచీఁకటి జారెను
తేటల చూపులనే తెల్ల వారెను
మేఁటి నీమోముకళలు మితిమీరెను
వూటలై మోవితేనెలు వుట్టి పద నూరెను

(॥ఇప్పుడే॥)
తగు నిట్టూర్పుల దాని దాడి ముట్టెను యెడఁ
తెగని చెమటల ముత్తేలు వుట్టెను
నగవుల సిగ్గుల నాము దొట్టెను
మొగిఁ జను జక్కవలు ముంగిలెల్లా మెట్టెను

(॥ఇప్పుడే॥)
కడఁగి పలకల మొలకలు నిక్కెను
తొడరి మైఁదీఁగె రతుల కెక్కెను
యెడయెక శ్రీవేంకటేశుఁడా వీఁడు
విడువక నిన్ను నేలె వేడుకలు దక్కెను

(||pallavi||)
ippuḍe ninniṁta sese niṁpula toḍa
nĕppunam̐ jĕppam̐ gadavĕ nīvunna jāḍa

(||ippuḍe||)
gām̐ṭabum̐ durumusīm̐kaḍi jārĕnu
teḍala sūbulane tĕlla vārĕnu
mem̐ṭi nīmomugaḽalu midimīrĕnu
vūḍalai movidenĕlu vuṭṭi pada nūrĕnu

(||ippuḍe||)
tagu niṭṭūrbula dāni dāḍi muṭṭĕnu yĕḍam̐
tĕgani sĕmaḍala muttelu vuṭṭĕnu
nagavula siggula nāmu dŏṭṭĕnu
mŏgim̐ janu jakkavalu muṁgilĕllā mĕṭṭĕnu

(||ippuḍe||)
kaḍam̐gi palagala mŏlagalu nikkĕnu
tŏḍari maim̐dīm̐gĕ radula kĕkkĕnu
yĕḍayĕga śhrīveṁkaḍeśhum̐ḍā vīm̐ḍu
viḍuvaga ninnu nelĕ veḍugalu dakkĕnu