Ippude nee ramanumdu yenasee ninnu

ఇప్పుడే నీ రమణుఁడు యెనసీ నిన్ను
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే నీ రమణుఁడు యెనసీ నిన్ను
చిప్పిలఁగ నప్పటిని సేదదేర్చవలెను

(॥ఇప్పు॥)
నెలవంకచందురులు నీచన్నుపై నుండఁగ
పలుమారు విరహతాపములేలే
కలువరేకులు నీకన్నులై వుండఁగాను
చలి మందుల వుపచారములేలే

(॥ఇప్పు॥)
మదనరేకలు నీకు మరి చెక్కుల నుండఁగా
అదన పువ్వుటమ్ముల కలుకనేలే
చెదరనికప్పురము సెలవుల నుండఁగాను
యెదుటనున్నకాఁకలు యేమిసేసీనే

(॥ఇప్పు॥)
మంచినచుక్కలు నీమోవిపై నిండివుండఁగా
యెంచిపగలంటి నిద్దిరించేవేలే
అంచెల శ్రీవేంకటేశు డంతలోనే నిన్నుఁ గూడె
ఇంచుకంతా చీఁకటి ఇఁకనేడదే

(||pallavi||)
ippuḍe nī ramaṇum̐ḍu yĕnasī ninnu
sippilam̐ga nappaḍini sedadersavalĕnu

(||ippu||)
nĕlavaṁkasaṁdurulu nīsannubai nuṁḍam̐ga
palumāru virahadābamulele
kaluvaregulu nīgannulai vuṁḍam̐gānu
sali maṁdula vubasāramulele

(||ippu||)
madanaregalu nīgu mari sĕkkula nuṁḍam̐gā
adana puvvuḍammula kaluganele
sĕdaranigappuramu sĕlavula nuṁḍam̐gānu
yĕduḍanunnagām̐kalu yemisesīne

(||ippu||)
maṁchinasukkalu nīmovibai niṁḍivuṁḍam̐gā
yĕṁchibagalaṁṭi niddiriṁchevele
aṁchĕla śhrīveṁkaḍeśhu ḍaṁtalone ninnum̐ gūḍĕ
iṁchugaṁtā sīm̐kaḍi im̐kaneḍade