Ippude ne nodambada maravamgam dagadu jeppidi yellanaamdu

ఇప్పుడే నే నొడఁబడ మరవఁగఁ దగదు జెప్పితి యెల్లనాఁడు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే నే నొడఁబడ మరవఁగఁ దగదు జెప్పితి యెల్లనాఁడు
నెప్పున నే నెంతకల్లరినైనా నీదాసుఁడనని యందురుగా

(॥ఇప్పు॥)
మఱతునో తలఁతునో నిన్ను మాఁటల నేతప్పు గలుగునో
యెఱఁగక నీదాసులఁజూచి యేమని పలుకుదునో
నెఱసిన నాకర్మఫలంబులు నీకు సమర్పణ సేసితిని
మఱి నామీఁదట నేరము లెంచక మాధవ నన్నిటు రక్షించవే

(॥ఇప్పు॥)
అలతునో సొలతునో నే నీయందు భక్తి సేతునో సేయనో
యెలమిని నీకు నివేదించక యేమేమి భుజియింతునో
తలఁచేటి నామనసే నీకును ధనముగాఁ గప్పము వెట్టితిని
పలుమరు నన్నును తగవుకుఁ దియ్యక పరమాత్మా ననుఁ గావఁగదే

(॥ఇప్పు॥)
నేరనో నేర్తునో నీకైంకర్యము నేమము లేమేమి మానితినో
నీరూపము నే సేవించి యెక్కడ నే ననుమానించితినో
మేరతోడ మావారు చెప్పఁగా మిమ్మింతట నే నమ్మితిని
వారిఁ జూచైన శ్రీవేంకటేశా వరదుఁడవై మము మన్నించఁ గదవే

(||pallavi||)
ippuḍe ne nŏḍam̐baḍa maravam̐gam̐ dagadu jĕppidi yĕllanām̐ḍu
nĕppuna ne nĕṁtagallarinainā nīdāsum̐ḍanani yaṁdurugā

(||ippu||)
maṟaduno talam̐tuno ninnu mām̐ṭala nedappu galuguno
yĕṟam̐gaga nīdāsulam̐jūsi yemani paluguduno
nĕṟasina nāgarmaphalaṁbulu nīgu samarbaṇa sesidini
maṟi nāmīm̐daḍa neramu lĕṁchaga mādhava nanniḍu rakṣhiṁchave

(||ippu||)
aladuno sŏladuno ne nīyaṁdu bhakti seduno seyano
yĕlamini nīgu nivediṁchaga yememi bhujiyiṁtuno
talam̐seḍi nāmanase nīgunu dhanamugām̐ gappamu vĕṭṭidini
palumaru nannunu tagavugum̐ diyyaga paramātmā nanum̐ gāvam̐gade

(||ippu||)
nerano nerduno nīgaiṁkaryamu nemamu lememi mānidino
nīrūbamu ne seviṁchi yĕkkaḍa ne nanumāniṁchidino
meradoḍa māvāru sĕppam̐gā mimmiṁtaḍa ne nammidini
vārim̐ jūsaina śhrīveṁkaḍeśhā varadum̐ḍavai mamu manniṁcham̐ gadave