Ippude machchigalado niddaru numdare meeru

ఇప్పుడే మచ్చికలతో నిద్దరు నుండరే మీరు
Language

(॥పల్లవి॥)
ఇప్పుడే మచ్చికలతో నిద్దరు నుండరే మీరు
చెప్పరాని చేఁత చేసి సిగ్గువడ వలెనా

(॥ఇప॥)
నంటున నాతఁడు నీతో నగఁగానే వేరెవేరె
గెంటసాలాడేవేలే వెంగెములుగాను
వొంటక యాతనిఁ బాసి యొక్కింత యోరువలేక
వెంట వెంటఁ దిరిగాడి వేఁడుకొనవలెనా

(॥ఇప॥)
ఆదరించి యాతఁడు మాటాడఁగాను కమ్మటిని
తోదోపులాడి పెనఁగి దూరఁగనేలే
కాదని యిప్పటికి నీకాఁ తాళాలు పెడరేఁచి
పాదుకొని పిదపను పంతమియ్యవలెనా

(॥ఇప॥)
ఆసతో శ్రీవేంకటేశుఁడట్టే నిన్నుఁ గూడఁగాను
వేసాలకేల విఱ్ఱవీఁగేవు నీవు
మోసపెట్టి యిప్పటికి మోవిగంటిసేసి నీవు
వోసరించి చన్నుల గోరూఁదించు కొనవలెనా

(||pallavi||)
ippuḍe machchigalado niddaru nuṁḍare mīru
sĕpparāni sem̐ta sesi sigguvaḍa valĕnā

(||iba||)
naṁṭuna nādam̐ḍu nīdo nagam̐gāne verĕverĕ
gĕṁṭasālāḍevele vĕṁgĕmulugānu
vŏṁṭaga yādanim̐ bāsi yŏkkiṁta yoruvalega
vĕṁṭa vĕṁṭam̐ dirigāḍi vem̐ḍugŏnavalĕnā

(||iba||)
ādariṁchi yādam̐ḍu māḍāḍam̐gānu kammaḍini
todobulāḍi pĕnam̐gi dūram̐ganele
kādani yippaḍigi nīgām̐ tāḽālu pĕḍarem̐si
pādugŏni pidabanu paṁtamiyyavalĕnā

(||iba||)
āsado śhrīveṁkaḍeśhum̐ḍaṭṭe ninnum̐ gūḍam̐gānu
vesālagela viṭravīm̐gevu nīvu
mosabĕṭṭi yippaḍigi movigaṁṭisesi nīvu
vosariṁchi sannula gorūm̐diṁchu kŏnavalĕnā