ఇప్పు డిదె కొలువున్నాఁ డింతులు దాను
(॥పల్లవి॥)
ఇప్పు డిదె కొలువున్నాఁ డింతులు దాను
వుప్పతిలు మహిమల నుద్దగిరి కృష్ణుఁడు
(॥ఇప్పు॥)
గోవులఁగాచెఁ గొన్నాళ్ళు కొండ గొడగగ
కావరించి మద్దులను గక్కన దొబ్బె
వావులు గలయ గొల్లవనితలఁ బొందుసేసె
వేవేలు చేఁతలవాఁడు వెన్నముద్ద కృష్ణుఁడు
(॥ఇప్పు॥)
మల్లులఁ గొందరి గొట్టె మరి కంసు బొదిగొనె
తెల్లె కోడెరాకాసుల దునిమివేసె
తెల్లమిగా వసుదేవ దేవకీనందనుఁ డాయ
వెల్లవిరై మెరసీని వెన్నముద్ద కృష్ణుఁడు
(॥ఇప్పు॥)
పొంతఁ బాండవులఁ గాచె భూ భార మణఁగించె
పంతముతో దేవతల బాలించెను
యింతట శ్రీవేంకటాద్రి నేలినాఁడు మమ్మిందరి
వింత వింత సొబగుల వెన్నముద్ద కృష్ణుఁడు
(||pallavi||)
ippu ḍidĕ kŏluvunnām̐ ḍiṁtulu dānu
vuppadilu mahimala nuddagiri kṛṣhṇum̐ḍu
(||ippu||)
govulam̐gāsĕm̐ gŏnnāḽḽu kŏṁḍa gŏḍagaga
kāvariṁchi maddulanu gakkana dŏbbĕ
vāvulu galaya gŏllavanidalam̐ bŏṁdusesĕ
vevelu sem̐talavām̐ḍu vĕnnamudda kṛṣhṇum̐ḍu
(||ippu||)
mallulam̐ gŏṁdari gŏṭṭĕ mari kaṁsu bŏdigŏnĕ
tĕllĕ koḍĕrāgāsula dunimivesĕ
tĕllamigā vasudeva devagīnaṁdanum̐ ḍāya
vĕllavirai mĕrasīni vĕnnamudda kṛṣhṇum̐ḍu
(||ippu||)
pŏṁtam̐ bāṁḍavulam̐ gāsĕ bhū bhāra maṇam̐giṁchĕ
paṁtamudo devadala bāliṁchĕnu
yiṁtaḍa śhrīveṁkaḍādri nelinām̐ḍu mammiṁdari
viṁta viṁta sŏbagula vĕnnamudda kṛṣhṇum̐ḍu