ఇప్పు డెరిఁగితి నేను యీపె నీకుఁ బ్రియమౌత
(॥పల్లవి॥)
ఇప్పు డెరిఁగితి నేను యీపె నీకుఁ బ్రియమౌత
ముప్పిరి నన్నేలితివి మొక్కే నే నీపెకు
(॥ఇప్పు॥)
నిక్కి నిక్కి యాపె నేఁడు నీ మొగమే చూచీని
చొక్కముగ నెటువంటిచుట్టమో నీకు
నెక్కొని సారె సారెకు నీతోనే మాఁటలాడీ
యిక్కు వతోడుత నీపై నెంతబత్తో తనకు
(॥ఇప్పు॥)
వద్దికి వచ్చి నీతో వడిగా నవ్వులు నవ్వీ
యిద్దరికి మీలో సన్న లెటువంటివో
కొద్దిమీరి చెక్కునొక్కి కొచ్చికొచ్చి వేఁడుకొనీ
ముద్దు ముద్దువలె నెంతముచ్చటో తనకు
(॥ఇప్పు॥)
మోవితేనె లూరనూర ముంచి వుపారము చూపీ
వేవేలుగా నవి యెంత వేడుకో నీకు
యావేళ శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ
దేవులాయ నీకు నెంతతేజమో తనకు
(||pallavi||)
ippu ḍĕrim̐gidi nenu yībĕ nīgum̐ briyamauda
muppiri nannelidivi mŏkke ne nībĕgu
(||ippu||)
nikki nikki yābĕ nem̐ḍu nī mŏgame sūsīni
sŏkkamuga nĕḍuvaṁṭisuṭṭamo nīgu
nĕkkŏni sārĕ sārĕgu nīdone mām̐ṭalāḍī
yikku vadoḍuda nībai nĕṁtabatto tanagu
(||ippu||)
vaddigi vachchi nīdo vaḍigā navvulu navvī
yiddarigi mīlo sanna lĕḍuvaṁṭivo
kŏddimīri sĕkkunŏkki kŏchchigŏchchi vem̐ḍugŏnī
muddu mudduvalĕ nĕṁtamuchchaḍo tanagu
(||ippu||)
movidenĕ lūranūra muṁchi vubāramu sūbī
vevelugā navi yĕṁta veḍugo nīgu
yāveḽa śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga
devulāya nīgu nĕṁtadejamo tanagu