ఇప్పు డేల చవు లయ్యీ నింపులు చాలని పొందు
(॥పల్లవి॥)
ఇప్పు డేల చవు లయ్యీ నింపులు చాలని పొందు
చప్ప నైనా నుప్ప నౌను సమ్మ తైతేఁ గాకా
(॥ఇప్పు డేల॥)
చలము సాదించేచోట సలిగెలు చెప్పఁ బోతే
ములుచదాన ననవా మొదల నీవే
వలచినవేళ నెంత వడి నేఁ గోపించినాను
తల ఱాయి సేసుకొని తగులుదు గాక
(॥ఇప్పు డేల॥)
నయము చాలనిచోట నవ్వులు నవ్వఁగఁ బోతే
బయకారించె ననవా పక్కన నీవే
ప్రియము గలవేళను బిగి నెంత నే నుండినా
దయ వుట్టి నీవు నన్ను దగ్గరుదు గాక
(॥ఇప్పుడేల॥)
తమకము లేనిచోట తతిఁ బెనఁగఁగఁ బోతే
భ్రమసి వున్న దనవా పై పై నీవే
అమర శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితిని
సమ మై యేకతవేళ సత మైతి గాకా
(||pallavi||)
ippu ḍela savu layyī niṁpulu sālani pŏṁdu
sappa nainā nuppa naunu samma taidem̐ gāgā
(||ippu ḍela||)
salamu sādiṁchesoḍa saligĕlu sĕppam̐ bode
mulusadāna nanavā mŏdala nīve
valasinaveḽa nĕṁta vaḍi nem̐ gobiṁchinānu
tala ṟāyi sesugŏni taguludu gāga
(||ippu ḍela||)
nayamu sālanisoḍa navvulu navvam̐gam̐ bode
bayagāriṁchĕ nanavā pakkana nīve
priyamu galaveḽanu bigi nĕṁta ne nuṁḍinā
daya vuṭṭi nīvu nannu daggarudu gāga
(||ippuḍela||)
tamagamu lenisoḍa tadim̐ bĕnam̐gam̐gam̐ bode
bhramasi vunna danavā pai pai nīve
amara śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidini
sama mai yegadaveḽa sada maidi gāgā