Ippu dela pamdam badi veda baada neegu naabai

ఇప్పు డేల పండఁ బడి వేడ బాద నీకు నాపై
Language

(॥పల్లవి॥)
ఇప్పు డేల పండఁ బడి వేడ బాద నీకు నాపై
గప్పిన యింపు గలిగితే కరుణింతు గాని

(॥ఇప॥)
నవ్వులనే యిందాఁక నాతో వేగించితివి
దివ్వెల వెలుఁగుననే తెల్లవారెను
రవ్వగా నదియుఁ గాక రతి సేసి వచ్చితివి
మువ్వంకఁ బన్నీరు చల్లేమోము చూపవయ్యా

(॥ఇప॥)
యిచ్చకము నాతో నాడి యెంత నోరు నొచ్చెనో
కొచ్చి యుండవయ్యా నీ చెక్కులు నొక్కెను
ముచ్చటలాడి వచ్చితి మొదల నందరితోడ
పిచ్చుగా ముద్రలు వెట్టెఁ బెదవి యేదయ్యా

(॥ఇప॥)
కన్నులిఁ జూచి చూచి కౌఁగిట నన్ను నించితి
వెన్న నున్న నూరఁగా వేడు కాయను
యిన్నీఁ జేసి శ్రీవేంకటేశ నన్ను మన్నించితి
వన్నువఁ బాదము దొక్కె నప్ప ణియ్యవయ్యా

(||pallavi||)
ippu ḍela paṁḍam̐ baḍi veḍa bāda nīgu nābai
gappina yiṁpu galigide karuṇiṁtu gāni

(||iba||)
navvulane yiṁdām̐ka nādo vegiṁchidivi
divvĕla vĕlum̐gunane tĕllavārĕnu
ravvagā nadiyum̐ gāga radi sesi vachchidivi
muvvaṁkam̐ bannīru sallemomu sūbavayyā

(||iba||)
yichchagamu nādo nāḍi yĕṁta noru nŏchchĕno
kŏchchi yuṁḍavayyā nī sĕkkulu nŏkkĕnu
muchchaḍalāḍi vachchidi mŏdala naṁdaridoḍa
pichchugā mudralu vĕṭṭĕm̐ bĕdavi yedayyā

(||iba||)
kannulim̐ jūsi sūsi kaum̐giḍa nannu niṁchidi
vĕnna nunna nūram̐gā veḍu kāyanu
yinnīm̐ jesi śhrīveṁkaḍeśha nannu manniṁchidi
vannuvam̐ bādamu dŏkkĕ nappa ṇiyyavayyā