Ippadigim janavari yimti neegu

ఇప్పటికిఁ జనవరి యింతి నీకు
Language

(॥పల్లవి॥)
ఇప్పటికిఁ జనవరి యింతి నీకు
కొప్పుదువ్వి నన్ను నేల కొంగువట్టేవిపుడు

(॥॥)
మలసి నీవు నాతో మాటలాడితివంటాను
సొలసీ నాపె నిన్నుఁ జుట్టి చుట్టి
కలికి యన్నిటా కడుఁగతలెల్ల నేరుచును
వెలలేని యాపెమాటే వినవయ్యా నీవు

(॥॥)
ననుపున నాతో నవ్వులు నవ్వితివంటా
గునిసీ నాపె నిన్నుఁగొచ్చి కొచ్చి
చనవరివినోదాల సరసురా లన్నిటాను
వొనర నాపెతో నవ్వి వుండవయ్యా నీవు

(॥॥)
గక్కన నన్ను నీవు కాఁగిటఁ గూడితివంటా
కక్కసించీ నాపె నిన్నుఁ గమ్మి కమ్మి
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నేనలమేలుమంగను
లెక్కతోనే యాపెఁ గాగిలించవయ్యా నీవు

(||pallavi||)
ippaḍigim̐ janavari yiṁti nīgu
kŏppuduvvi nannu nela kŏṁguvaṭṭevibuḍu

(||||)
malasi nīvu nādo māḍalāḍidivaṁṭānu
sŏlasī nābĕ ninnum̐ juṭṭi suṭṭi
kaligi yanniḍā kaḍum̐gadalĕlla nerusunu
vĕlaleni yābĕmāḍe vinavayyā nīvu

(||||)
nanubuna nādo navvulu navvidivaṁṭā
gunisī nābĕ ninnum̐gŏchchi kŏchchi
sanavarivinodāla sarasurā lanniḍānu
vŏnara nābĕdo navvi vuṁḍavayyā nīvu

(||||)
gakkana nannu nīvu kām̐giḍam̐ gūḍidivaṁṭā
kakkasiṁchī nābĕ ninnum̐ gammi kammi
nikki śhrī veṁkaḍeśhum̐ḍa nenalamelumaṁganu
lĕkkadone yābĕm̐ gāgiliṁchavayyā nīvu