Ippadigadi yide yemchinanu

ఇప్పటిగతి యిదె యెంచినను
Language

(॥పల్లవి॥)
ఇప్పటిగతి యిదె యెంచినను
కప్పిన భ్రమయో కరుణో యెఱఁగ

(॥ఇప్ప॥)
తలఁపున నాపతిఁ దలఁచినంతలో
నెలకొని ముందట నిలిచె నిదె
కలసినట్లనే కమ్మరఁ దోఁచీ
కలయో నిజమో కపటమో యెఱఁగ

(॥ఇప్ప॥)
అడుగిడీనే నేఁ డలిగిననాఁడే
బడివాయనిపతిభావ మిదే
అడియాలంబులు అవెయివె నాపై
తడయనితగులో తమకమో యెఱఁగ

(॥ఇప్ప॥)
గక్కన శ్రీవేంకటపతి నాకును
నిక్కపుఁగూటమి నెంపె నిదే
యిక్కువ లివివో ఇందాఁకానే
యెక్కడ నేమో యేదియు నెఱఁగ

(||pallavi||)
ippaḍigadi yidĕ yĕṁchinanu
kappina bhramayo karuṇo yĕṟam̐ga

(||ippa||)
talam̐puna nābadim̐ dalam̐sinaṁtalo
nĕlagŏni muṁdaḍa nilisĕ nidĕ
kalasinaṭlane kammaram̐ dom̐sī
kalayo nijamo kabaḍamo yĕṟam̐ga

(||ippa||)
aḍugiḍīne nem̐ ḍaliginanām̐ḍe
baḍivāyanibadibhāva mide
aḍiyālaṁbulu avĕyivĕ nābai
taḍayanidagulo tamagamo yĕṟam̐ga

(||ippa||)
gakkana śhrīveṁkaḍabadi nāgunu
nikkabum̐gūḍami nĕṁpĕ nide
yikkuva livivo iṁdām̐kāne
yĕkkaḍa nemo yediyu nĕṟam̐ga