ఇప్పటికాలమువారు యేమీ నేరరు
(॥పల్లవి॥)
ఇప్పటికాలమువారు యేమీ నేరరు
అప్పటనుండియు వెఱఁగందితిఁ బో నేను
(॥ఇప్పటి॥)
కన్నుసన్నలనే నిన్ను కైవశము చేకొనే
కన్నెపడుచా యిది కలికి గాక
వన్నెల మాటలే ఆడి వద్ద నుండి మీతోను
యెన్ని కతలు గరచె యింతలోనే తాను
(॥ఇప్పటి॥)
యిక్కువ చెప్పి యంపి ని న్నింటికి రప్పిం చుకొనె
దిక్కుల యింతిమాత్ర మా దేవర గాక
పక్కన తా నవ్వి నీవు పైకొంటే జంకించీని
యెక్కడిమాయలు వన్ని యేమందు నేను
(॥ఇప్పటి॥)
కప్పురముమోవి నిచ్చి కౌఁగిట నిన్ను బిగించె
యిప్పుడు నీకుఁ దక్కువా యెక్కుడే కాక
ముప్పిరి శ్రీవేంకటేశ మొగి నన్నుఁ గూడితివి
తప్పు లెంచి నన్ను నాపెదంటతన మెట్టిదో
(||pallavi||)
ippaḍigālamuvāru yemī neraru
appaḍanuṁḍiyu vĕṟam̐gaṁdidim̐ bo nenu
(||ippaḍi||)
kannusannalane ninnu kaivaśhamu segŏne
kannĕbaḍusā yidi kaligi gāga
vannĕla māḍale āḍi vadda nuṁḍi mīdonu
yĕnni kadalu garasĕ yiṁtalone tānu
(||ippaḍi||)
yikkuva sĕppi yaṁpi ni nniṁṭigi rappiṁ sugŏnĕ
dikkula yiṁtimātra mā devara gāga
pakkana tā navvi nīvu paigŏṁṭe jaṁkiṁchīni
yĕkkaḍimāyalu vanni yemaṁdu nenu
(||ippaḍi||)
kappuramumovi nichchi kaum̐giḍa ninnu bigiṁchĕ
yippuḍu nīgum̐ dakkuvā yĕkkuḍe kāga
muppiri śhrīveṁkaḍeśha mŏgi nannum̐ gūḍidivi
tappu lĕṁchi nannu nābĕdaṁṭadana mĕṭṭido