Ippadi veduge soosee nidivo taanu

ఇప్పటి వేడుకే చూచీ నిదివో తాను
Language

(॥పల్లవి॥)
ఇప్పటి వేడుకే చూచీ నిదివో తాను
అప్పటప్పటికి తన కాడికలై వుండవా

(॥ఇప్ప॥)
చేతులారాఁ జేసేచేఁత చెప్పితే సిగ్గయ్యీ నాకు
ఆతనినే యడుగరే అతివలాల
కాతరపు మగవాఁడు కాదు గూడదనరాదు
యీతల నెవ్వతె విన్నా నేతువలెత్తేడరా

(॥ఇప్ప॥)
నోరునిండా మాటాలాడె నొడుగరా దందరిలో
చేరి పతి నడుగరే చెలులాల
దూరినా నియ్యకొనఁడు తూరవలచినవాఁడు
కారణాలు చెప్పఁబొతే కడవారు నవ్వరా

(॥ఇప్ప॥)
అక్కు మోవఁ గాఁగిలించె నట్టె వెరగయ్యీని
మొక్కి తన్ను నడుగరే ముదితలాల
ఇక్కువ శ్రీవేంకటేశుం డీతఁడే నన్నుం గూడె
తక్కక ఇందు కిందరు తప్ప కిట్టె చూడరా

(||pallavi||)
ippaḍi veḍuge sūsī nidivo tānu
appaḍappaḍigi tana kāḍigalai vuṁḍavā

(||ippa||)
sedulārām̐ jesesem̐ta sĕppide siggayyī nāgu
ādanine yaḍugare adivalāla
kādarabu magavām̐ḍu kādu gūḍadanarādu
yīdala nĕvvadĕ vinnā neduvalĕtteḍarā

(||ippa||)
noruniṁḍā māḍālāḍĕ nŏḍugarā daṁdarilo
seri padi naḍugare sĕlulāla
dūrinā niyyagŏnam̐ḍu tūravalasinavām̐ḍu
kāraṇālu sĕppam̐bŏde kaḍavāru navvarā

(||ippa||)
akku movam̐ gām̐giliṁchĕ naṭṭĕ vĕragayyīni
mŏkki tannu naḍugare mudidalāla
ikkuva śhrīveṁkaḍeśhuṁ ḍīdam̐ḍe nannuṁ gūḍĕ
takkaga iṁdu kiṁdaru tappa kiṭṭĕ sūḍarā