ఇప్పటి మన్నన నాయం దిట్టే నిలుపుమీ
(॥పల్లవి॥)
ఇప్పటి మన్నన నాయం దిట్టే నిలుపుమీ
తప్పక మిగులా నాపై దయదలఁచితివి
(॥ఇప్ప॥)
చుట్టరికములు చెప్పి సోబానఁ బాడించి
అట్టె నన్ను లాలించి పెండ్లాడితివి
గట్టిగా నాముఁ(ముం?)జేతను కంకణము నీవేకట్టి
గుట్టుతో నీసంగడినే కూచుండఁబెట్టితివి
(॥ఇప్ప॥)
చాయలు సన్నలు జూపి చక్కఁదనాలు వొగడి
సేయరాని బాసలెల్లాఁ జేసితివి
చేయి గుబ్బలపైఁ జాఁచి సిగ్గులు జారఁగఁజేసి
కాయజకేలిని మది గరఁగించితివి
(॥ఇప్ప॥)
చెలిమి వచారించి సెలవినవ్వులతోడ
అలరి పొత్తులనిడు కారగించితి
యెలమి శ్రీవేంకటేశ యింతసేసి కూడితివి
వలిపించితివి నన్ను వదలకుమి
(||pallavi||)
ippaḍi mannana nāyaṁ diṭṭe nilubumī
tappaga migulā nābai dayadalam̐sidivi
(||ippa||)
suṭṭarigamulu sĕppi sobānam̐ bāḍiṁchi
aṭṭĕ nannu lāliṁchi pĕṁḍlāḍidivi
gaṭṭigā nāmum̐(muṁ?)jedanu kaṁkaṇamu nīvegaṭṭi
guṭṭudo nīsaṁgaḍine kūsuṁḍam̐bĕṭṭidivi
(||ippa||)
sāyalu sannalu jūbi sakkam̐danālu vŏgaḍi
seyarāni bāsalĕllām̐ jesidivi
seyi gubbalabaim̐ jām̐si siggulu jāram̐gam̐jesi
kāyajagelini madi garam̐giṁchidivi
(||ippa||)
sĕlimi vasāriṁchi sĕlavinavvuladoḍa
alari pŏttulaniḍu kāragiṁchidi
yĕlami śhrīveṁkaḍeśha yiṁtasesi kūḍidivi
valibiṁchidivi nannu vadalagumi