Ippadi kobamu meegitte vumdeenaa

ఇప్పటి కోపము మీకిట్టె వుండీనా
Language

(॥పల్లవి॥)
ఇప్పటి కోపము మీకిట్టె వుండీనా
వొప్పుగా నాతఁడు నీవు నొక్కటే కాదటవే

(॥ఇప్ప॥)
గుట్టుతోడ నీ విభుఁడు కొంగుపట్టి తీసితేను
పెట్టరానివొట్టులేల పెట్టేవే నీవు
చుట్టమై తనముచ్చట సుద్దులు నీకుఁ జెప్పితే
వట్టితప్పులెల్లా వేసి వాదింతురటవే

(॥ఇప్ప॥)
పాయలేక యీతఁడు నీపై బత్తిసేసి తేను
చేయరానిచేఁతవేల సేసేవే నీవు
నీయెడకు బాఁతిపడి నెయ్యములు చూపితేను
చాయలా సన్నలాజూచి చండిసేతురటవే

(॥ఇప్ప॥)
ఇవ్వల శ్రీవేంకటేశుఁడిటు నిన్నుఁ గూడితేను
నవ్వరాని నవ్వులేల నవ్వేవే నీవు
పువ్వులదండలు నీ కొప్పునఁ గడుజుట్టితేను
రవ్వగా నాతనిసిగ్గు రచ్చవేతురటవే

(||pallavi||)
ippaḍi kobamu mīgiṭṭĕ vuṁḍīnā
vŏppugā nādam̐ḍu nīvu nŏkkaḍe kādaḍave

(||ippa||)
guṭṭudoḍa nī vibhum̐ḍu kŏṁgubaṭṭi tīsidenu
pĕṭṭarānivŏṭṭulela pĕṭṭeve nīvu
suṭṭamai tanamuchchaḍa suddulu nīgum̐ jĕppide
vaṭṭidappulĕllā vesi vādiṁturaḍave

(||ippa||)
pāyalega yīdam̐ḍu nībai battisesi tenu
seyarānisem̐tavela seseve nīvu
nīyĕḍagu bām̐tibaḍi nĕyyamulu sūbidenu
sāyalā sannalājūsi saṁḍiseduraḍave

(||ippa||)
ivvala śhrīveṁkaḍeśhum̐ḍiḍu ninnum̐ gūḍidenu
navvarāni navvulela navveve nīvu
puvvuladaṁḍalu nī kŏppunam̐ gaḍujuṭṭidenu
ravvagā nādanisiggu rachchaveduraḍave